ఫ్యామిలీ కి కనెక్ట్ అయితే తిరుగుండదు!
Aadarsha Kutumbam: Release Buzz Challenge
పలుమార్లు వాయిదాలతో అక్టోబర్ 30 న విడుదలకు సిద్దమైన వెంకటేష్-త్రివిక్రమ్ శ్రీనివాస్ ల ఆదర్శ కుటుంబం చిత్రం పై ప్రస్తుతం చాలా లో బజ్ కనిపిస్తుంది. కారణం త్రివిక్రమ్ జోనర్ మార్చడమే. అందులోను ఈ చిత్రం అర్జున్ బ్లాస్ట్ కి రీమేక్ లా ఉంది అనే కామెంట్స్ కూడా ఈ సినిమాపై ఆడియన్స్ లో ఆసక్తి తగ్గడానికి కారణమయ్యింది.
మరి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఫ్యామిలికి కనెక్ట్ అయ్యేలా డైలాగ్స్ ని రాస్తే, వెంకీ కి ఉన్న ఫ్యామిలీ మ్యాన్ ఇమేజ్ తో ఫ్యామిలీ ఆడియన్స్ కి గనక ఆదర్శ కుటుంబం కనెక్ట్ అయితే ఈ చిత్రానికి తిరుగుండదు. క్రైమ్ కామెడీ, మర్డర్ కామెడీ అంటూ ఆదర్శ కుటుంబం పై త్రివిక్రం చేస్తున్న కామెంట్స్ సినిమాపై కుటుంబ ప్రేక్షకులను కన్ఫ్యూజ్ చేస్తున్నాయి.
ఏది ఏమైనా ఆదర్శ కుటుంబం ఫస్ట్ షో తర్వాతే సినిమా రిజల్ట్ ని బట్టి హైప్ క్రియేట్ అయ్యేలా ఉంది. మరోపక్క ఆదర్శ కుటుంబానికి పెద్దగా పోటీ కూడా లేదు, విశ్వక్ సేన్ కల్ట్ మాస్ మూవీ. మాస్ ఆడియన్స్ కి తప్ప ఫ్యామిలీ ఆడియన్స్ ఈ చిత్రానికి కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ తక్కువ. సో ఆదర్శ కుటుంబానికి అదే అడ్వాంటేజ్.. చూద్దాం ఈ వారం బాక్సాఫీసు పోటీ ఎలా ఉంటుందో అనేది.
















































