BB10: త్రిగుణ్ vs రోహిత్, బయట ఫ్యాన్స్ కొట్లాట

Bigg Boss 10: Trigun vs RohitBigg Boss 10: Trigun vs Rohit

 

 

బిగ్ బాస్ సీజన్ 10 హౌస్ లో మొదటి వారం నుంచే త్రిగుణ్ కి రోహిత్ కి అస్సలు పడడం లేదు. ఫుడ్ దగ్గర, టాస్క్ దగ్గర, క్లోత్స్ ఇలా ఏ విషయంలో అయినా వారిద్దరి మద్యన మాటల యుద్ధం, ఓపెన్ వార్, లేదా కోల్డ్ వార్ జరుగుతూనే ఉంటుంది. త్రిగుణ్ ఎత్తులకు పై ఎత్తులు వేయాల్సిన రోహిత్ సహనం కోల్పోయి అతనిపై నోరు పారేసుకుంటున్నాడు. హౌస్ లో వీరి మద్యన రచ్చ మొదలైంది అంటే చాలు బయట అభిమానుల మధ్యన గొడవ కూడా మొదలవుతుంది.

అంతేకాదు బిగ్ బాస్ రివ్యూస్ చెప్పుకునేవారు కూడా ఒకరు త్రిగుణ్ కి మరొకరు రోహిత్ సైడ్ తీసుకుని రివ్యూస్ ఇస్తున్నారు. రోహిత్ పిఆర్ టీం లక్షల్లో ఖర్చు పెడుతుంది అని ఒకరు, త్రిగుణ్ గేమర్ కాదు, మానిప్యులేటర్ అంటూ ఒకరు సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు.

ఏది ఏమైనా కామనర్ రోహిత్ ఈసారి బిగ్ బాస్ కప్ పట్టుకుపోతాడు అని, కాదు కాదు బిగ్ బాస్ విన్నర్ త్రిగుణ్ అంటూ వారికీ సపోర్ట్ చేసే వారు లైవ్ లోకొచ్చి కొట్టుకుంటున్నారు. అసలు రోహిత్ ఏం చేసాడు, ఏం ఆడాడు అని గెలుస్తాడు అంటే, అసలు త్రిగుణ్ గేమ్ ఎక్కడుంది, అందరిని మ్యానిప్యులేట్ చేసుకుంటూ హౌస్ లో ఉన్నాడు అని కొందరు, త్రిగుణ్ లేకపోతె బిగ్ బాస్ లేదు అని చాలామంది మాట్లాడడం హైలెట్ అవుతోంది.  

Bigg Boss Telugu 10