BB10: షాలిని-రోహిత్.. ఓపెన్ గా చెప్పినా బుద్దిరావట్లేదు
Bigg Boss 10: Wildcards vs Rohit and Shalini
ఆదివారం రాత్రి దసరా స్పెషల్ వైల్డ్ ఫైర్ ఈవెంట్ లో బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన వైల్డ్ కార్డు లు శివ, నీతూ, అగ్నిపరీక్ష, దక్షి, శ్వేతా నాయుడు, రామకృష్ణ ఇలా అందరూ షాలిని, రోహిత్ పెయిర్ పై బయట ఏం జరుగుతుందో చెప్పకనే చెప్పినా వారికి ఇసుమంతైనా బుద్ది రాలేదు అనిపిస్తుంది. వాళ్ళు చెప్పిన పదినిమిషాలకే రోహిత్, షాలిని కూర్చుని మనల్ని కావాలనే వైల్డ్ కార్డులు టార్గెట్ చేసున్నారని రోహిత్..
నేను నిన్ను ఇంప్రెస్ చెయ్యడానికి కష్టపడుతున్నాను అంటున్నారు, మరి వర్షిణి ఏం చేస్తుంది, ముఖేష్ తో తిరగడానికి అంటూ షాలిని చెప్పాడం, నువ్వు స్ట్రాంగ్.. వంశి కన్నా, వర్షిణి కన్నా నువ్వే బెటర్ అని రోహిత్ అనగానే ఆబ్ యస్లీ అంటూ షాలిని రోహిత్ కి చెప్పడం, అసలు షాలిని తనపై వస్తున్న విమర్శలు పట్టించుకోకపోవడం నిజంగా విచిత్రమే.
మరి వాళ్లపై బయట జరుగుతున్న చర్చ అటు ఆడియన్స్ చెప్పినా, ఇటు బయట నుంచి వచ్చిన వైల్డ్ కార్డ్స్ హెచ్చరించినా కూడా రోహిత్, షాలిని రియలైజ్ అవ్వకుండా పక్కన వాళ్లను కంపేర్ చేసుకుంటూ మాట్లాడుకోవడం చూసి ఆడియన్స్ కూడా నవ్వుకుంటున్నారు.















































