కాక లో కేక పెట్టించే గెటప్ లో చిరు

Latest developments in KaakaLatest developments in Kaaka

 

మెగాస్టార్ చిరంజీవి - బాబీ కొల్లి కలయికలో సెకండ్ మూవీగా తెరకెక్కుతున్న కాక చిత్ర షూటింగ్ పరుగులు పెడుతుంది. 2027 సంక్రాంతి టార్గెట్ గా రిలీజ్ డేట్ అనౌన్స్ చెయ్యడమే కాదు.. అందుకు అనుగుణంగా దర్శకుడు బాబీ కాక షూటింగ్ విషయంలో ప్లానింగ్ తో ముందుకు వెళుతున్నారు.

చిరు బర్త్ డే రోజునే కాక లో చిరు సూపర్ వైజర్ సత్యంగా ఇంట్రడ్యూస్ అయ్యారు. అయితే కాక చిత్రంలో మూడు లుక్స్, మూడు గెటప్స్ లో మెగాస్టార్ కనిపించబోతున్నారని.. అందులో ఒకటి సూపర్ వైజర్ సత్యం, రెండోది గ్యాంగ్ స్టర్ పాత్ర. ఆ పాత్రని దర్శకుడు బాబీ చాలా పవర్ ఫుల్ గా డిజైన్ చేశారట.

దీనిని బట్టి చిరు ద్విపాత్రాభినయం చేస్తున్నారనే స్పష్టత వచ్చేసింది. ఇక మూడో లుక్ ని గ్యాంగ్ స్టార్ పాత్రకి రిలేటెడ్ గా ఉండబోతుంది అని, ఆ పాత్రలోనే మరో షెడ్ చూపించబోతున్నారని చెబుతున్నారు. కాక లో ఈ మూడు లుక్స్ కేక పెట్టిస్తాయని చిత్ర బృందం చెబుతున్నది.

ఈ చిత్రంలో బాలీవుడ్ డైరెక్టర్ కమ్ యాక్టర్ అనురాగ్ కశ్యప్ విలన్ రోల్ ప్లే చేస్తుండగా.. మెగాస్టార్ కి భార్యగా స్నేహ కనిపిస్తుండగా.. అనశ్వర రాజన్ చిరు-స్నేహ కి కూతురుగా కనిపించబోతుంది.

Inside happenings of Kaaka