ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Bigg Boss 10: Sudheer becomes the new captain in the house

BB10: ఐదో వారం కొత్త కెప్టెన్..

Bigg Boss 10: Sudheer becomes the new captain in the houseBigg Boss 10: Sudheer becomes the new captain in the house


బిగ్ బాస్ సీజన్ 10 లో కెప్టెన్సీ టాస్క్, అలాగే ఇమ్యూనిటీ కోసం కంటెస్టెంట్స్ పోటీపడుతున్నారు. అమన్, త్రిగుణ్ లు ముందుగా టాస్క్ ల్లో గెలిచి ఇమ్యూనిటీ పొందారు, తర్వాత కెప్టెన్సీ టాస్క్ లో ఫైనల్ గా వంశీ, సుధీర్, దేబ్జానీ, త్రిగుణ్, రాం ప్రసాద్ లు తలపడగా.. అందులో సుధీర్ ముందుగా టాస్క్ గెలిచినట్లుగా తెలుస్తుంది.

అయితే ఝాన్సీ ఈ వారం తన మ్యాజికల్ కీ ని ఉపయోగించింది. ఫైనల్ టాస్క్ లో ఆమె ఎవరిని సపోర్ట్ చెయ్యాలో అనేది అమన్ తో చర్చిస్తున్న సమయంలో సుధీర్ ఝాన్సీ ని హెల్ప్ అడుగుతూ అరిచేస్తున్నాడు, అయినా ఝాన్సీ సుధీర్ ను పట్టించుకోలేదు. తర్వాత ఆమె సుధీర్‌కి సపోర్ట్ చేయాలని అనుకుంటుంది. చివరకు తన బిన్ బ్యాగ్‌ని సుధీర్‌కి ఇస్తుంది ఝాన్సీ.

అలా సుధీర్ ముందుగా టాస్క్ ఫినిష్ చేసినట్టు అనిపిస్తోంది. అది గెలిచి సుధీర్ కెప్టెన్ గా మారాడు. ఇక ఆ మ్యాజికల్ కీ తో ఝాన్సీ కూడా ఈ వారం నామినేషన్స్ నుంచి సేవ్ అయినట్లుగా బిగ్ బాస్ ప్రకటించేసారు. ఝాన్సీ సేవ్ అవడంతో ఈ వారం ఓటింగ్ లో అపూర్వ, చరణ్ లు ఉన్నారు. ఝాన్సీ ఇమ్యూనిటీ తో సేవ్ అవ్వగా.. చరణ్ లేదా అపూర్వ లలో ఎవరో ఒకరు ఈ వారం ఎలిమినేటయ్యే అవకాశం ఉంది.

Bigg Boss Telugu 10: Sudheer