వారణాసిపై ఎఫెక్ట్ - అవకాశం ఉందా?
Varanasi Movie Update
ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న వారణాసి చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ లో విడుదల కాబోతుంది. ప్రస్తుతం షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ లోకి ఎంటర్ అయిన ఈ చిత్రంపై రాజమౌళి కొడుకు నిర్మించిన డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ వల్ల ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా అనే సందేహాలు చాలామందిలో కనిపిస్తున్నాయి.
కార్తికేయ నిర్మించిన ఈ చిత్రాన్ని రాజమౌళి, ఆయన ఫ్యామిలీ ప్రచారం చేసింది. ప్రమోషన్స్ లో రాజమౌళి ఫ్యామిలీ కనిపించడమే కాదు డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ ఎడిటింగ్ లో రాజమౌళి చెయ్యి పడిందనే ప్రచారం ఉంది. మరోపక్క ఆ చిత్రాన్ని అంతగా ప్రమోట్ చేసారు. కానీ సినిమా రిజల్ట్ తేడా కొట్టింది.
దానితో రాజమౌళి ఎంతో కష్టపడి సినిమా చేస్తారు, హిట్ కొడతారు. ఫ్యామిలీ మొత్తం ఆ సినిమాలో ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది. కానీ ఇప్పుడు డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ కి వస్తున్న ఫీడ్ బ్యాక్ వల్ల వారణాసి చిత్రంపై ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా, రాజమౌళి జెడ్జిమెంట్ పై అనుమానాలు కలుగుతాయా అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి.
అయితే డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ ఎఫెక్ట్ వారణాసి పై పడదు. అసలు అలా అనుకోవడానికి కూడా లేదు, రాజమౌళి నుంచి వచ్చే గ్లోబల్ కంటెంట్ పై ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని మరికొందరు గట్టిగా కామెంట్ చేస్తున్నారు.
















































