ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Atlee Opens Up on Working With Vijay's Son Jason Sanjay

ఒకే సినిమాకు ఇద్ద‌రు ద‌ర్శ‌కులా!

Atlee Opens Up on Working With Vijay's Son Jason SanjayAtlee Opens Up on Working With Vijay's Son Jason Sanjay

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ తాజాగా విజయ్ కుమారుడు, యువ దర్శకుడు జాసన్ సంజయ్‌తో కలిసి పనిచేసే అవకాశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమిళ స్టార్ హీరో విజయ్‌తో `తేరి`, `మెర్సల్`, `బిగిల్` వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలను అందించిన అట్లీకి- విజయ్ కుటుంబంతో మంచి సాన్నిహిత్యం ఉంది. ఈ నేపథ్యంలో జాసన్ సంజయ్ దర్శకుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వ‌డం.. ఆయన భవిష్యత్తు ప్రాజెక్ట్‌లపై ప్రస్తుతం కోలీవుడ్‌లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

కోలీవుడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం జాసన్ సంజయ్ తన దర్శకత్వ ప్రతిభతో అడుగులు వేస్తున్నారు. అయితే అట్లీ ఇటీవల ఓ  ఇంటర్వ్యూలో జాసన్ సంజయ్‌తో కలిసి పనిచేసే అవకాశం ఉందా అనే ప్రశ్నకు సానుకూలంగా స్పందించారు. భవిష్యత్తులో తగిన కథ కుదిరితే జాసన్ సంజయ్‌తో కలిసి పనిచేయడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని.. ఆయన టాలెంట్‌ను తాను గౌరవిస్తానని అట్లీ పేర్కొనడం విశేషం.

ప్రస్తుతం జాసన్ సంజయ్ తనదైన శైలిలో కథలను ఎంచుకుంటూ దర్శకుడిగా నిలదొక్కుకునే ప్రయత్నంలో ఉన్నారు. మరోవైపు అట్లీ కూడా పాన్-ఇండియా స్థాయిలో వరుస భారీ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. ఇలాంటి తరుణంలో  అట్లీ నుంచి జాసన్ సంజయ్ గురించి పాజిటివ్‌గా మాటలు రావడంతో, భవిష్యత్తులో ఈ క్రేజీ కాంబినేషన్‌లో సినిమా వచ్చే అవకాశం ఉందంటూ సోషల్ మీడియాలో  ప్రచారం సాగుతోంది.

Atlee- Jason Sanjay