BB10: అమన్ కు ఎల్లో కార్డు చూపించిన నాగ్

Bigg Boss 10: Today Promo HighlightsBigg Boss 10: Today Promo Highlights

 

బిగ్ బాస్ సీజన్ 10 నాలుగో వారంలో హౌస్ మేట్స్ ఆట తీరు, మాట తీరు పై హోస్ట్ నాగార్జున ఆగ్రహంతో ఊగిపోయారు. చిన్నదో వైపు, పెద్దదో వైపు అంటూ మాట్లాడిన ముఖేష్ ని మొహం వాచేలా తిట్టిన నాగార్జున, ముఖేష్ మాట్లాడిన మాటలు కరెక్ట్ ఆ అని ఝాన్సీని అడిగారు. తప్పు సర్ అనింది ఝాన్సీ. ఆ తర్వాత దేబ్జనిని అడిగారు నాగ్.

ఇక ఈ ప్రోమోలో హోస్ట్ నాగార్జున అమన్ కు ఎల్లో కార్డు చూపించడం హాట్ టాపిక్ అయ్యింది. అమన్ త్రిగున్ ని తోసేస్తూ ఆడిన తీరు, హౌస్ మేట్స్ తో అమన్ గొడవ పడుతున్న తీరుపై నాగార్జున ఫైర్ అయ్యారు.

నువ్వు ఆట ఆడుతున్నావా లేదంటే గల్లీ లో కొట్టుకుంటున్నట్టుగా  కొట్టుకుంటున్నావా, ఈసారి ఇలాంటిది చేస్తే ప్రశ్నలు వెయ్యను, సమాధానం వినను డైరెక్ట్ గా బయటికే అంటూ నాగార్జున అమన్ ను నిలబెట్టి క్లాస్ పీకిన ప్రోమో వైరల్ అవుతుంది. 

Bigg Boss 10