ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Drishyam The Conclusion Opens to a Massive Box Office Response

జస్ట్ టైటిల్ వాడారు - కథ మొత్తం కొత్తదే

Drishyam The Conclusion Opens to a Massive Box Office ResponseDrishyam The Conclusion Opens to a Massive Box Office Response


మలయాళ హిట్ ఫ్రాంచైజీ దృశ్యం చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీలో రీమేక్స్ చేసారు. మొదటి రెండు భాగాలూ తెలుగు, తమిళ, హిందీలో రీమేక్ అయ్యాయి. మలయాళంలో తెరకెక్కిన దృశ్యం 3 మూడో భాగాన్ని మాత్రం తెలుగు, తమిళ మేకర్స్ లైట్ తీసుకున్నారు. కానీ హిందీలో అజయ్ దేవగన్ దృశ్యం 3 ని రీమేక్ చేసారు.

అయితే మలయాళంలో మోహన్ లాల్-జీతూ జోసెఫ్ ల దృశ్యం 3 కి సో సో రెస్పాన్స్ వచ్చింది, అలాగే దృశ్యం 4 కూడా ఉంటుంది అని అనౌన్స్ చేసారు. దానికి రీమేక్ అంటే యాజిటీజ్ గా కథ అలానే ఉన్నా కొంత మార్పులు చేర్పులు చేసి అజయ్ దేవగన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు అనుకుంటే పప్పులో కాలేసినట్లే.

హిందీలో దృశ్యం 3 కి జస్ట్ టైటిల్ మాత్రమే వాడారు. ఇక ఆ కేసు ను రీ ఓపెన్ చెయ్యడం తప్పితే.. కథను దర్శకుడు కొత్తగా రాసుకుని ప్రెజెంట్ చేసాడు. దృశ్యం ది కంక్లూజన్ అంటూ ఈ ఫ్రాంచైజీ కి హిందీలో ఎండ్ కార్డు వేసేసారు. ఈ చిత్రం విడుదలకు ముందు నుంచే బుకింగ్స్ పరంగా రికార్డులు క్రియేట్ చేసింది.

దృశ్యం ది కంక్లూజన్ చిత్రం విడుదలయ్యాక పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. ల్యాగ్ లేకుండా దర్శకుడు దృశ్యం 3 ని నడిపించిన తీరుకి ప్రేక్షకులు క్లాప్స్ కొడుతున్నారు. మరి మలయాళంలో దృశ్యం సీరీస్ ని సాగదీస్తుంటే.. హిందీ లో హిట్ టాక్ తో దృశ్యం 3 ని కంక్లూజన్ పేరుతొ ఎండ్ చేశారన్నమాట. 

Drishyam The Conclusion