RC17 : వన్ ఇయర్ టార్గెట్

RC17 Muhurtham On Dussehra RC17 Muhurtham On Dussehra

 

పెద్ది చిత్రం తర్వాత రామ్ చరణ్ RC17 ప్రాజెక్ట్ ను సుకుమార్ దర్శకత్వంలో మొదలు పెట్టాల్సి ఉంది. కానీ రామ్ చరణ్ మణికట్టు ఆపరేషన్ తో అది కాస్తా పోస్ట్ పోన్ అయ్యింది. ప్రస్తుతం రామ్ చరణ్ మణికట్టు సర్జరీ తర్వాత కోలుకుంటూ ఉండడంతో RC17 ప్రాజెక్ట్ ముందుకు కదలబోతుంది. అంటే ఈ దసరా కు పూజా కార్యక్రమాలతో సుకుమార్-రామ్ చరణ్ మూవీ మొదలు కాబోతుంది.

కాకపోతే డిసెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టి 2027 డిసెంబర్ నాటికీ షూటింగ్ పూర్తి చేసే ఆలోచనలో సుకుమార్ ఉన్నారట. RC17 ప్రీ ప్రొడక్షన్ ని అలాగే షూటింగ్ అన్ని ప్లాన్ చేసుకుంటున్నారని తెలుస్తుంది. 12 నెలలు అంటే వన్ ఇయర్ టార్గెట్ తో RC17 రెగ్యులర్ షూటింగ్ మొదలు కాబోతుందన్నమాట.

ఇక ఈ చిత్రంలో రామ్ చరణ్ కి జోడిగా నటించే హీరోయిన్, అలాగే కీలక నటులు, టెక్నీకల్ టీమ్ ఎంపిక విషయంలో సుకుమార్ దృష్టి పెట్టారని, సుకుమార్ ఈసారి ఎట్టి పరిస్థితిల్లో ప్లానింగ్ మిస్ కారనే టాక్ నడుస్తుంది. 

Ram Charan, Sukumar RC17 Eyes Vijayadashami Launch