ప్రమాదంలో వెన్నెపూస పోగొట్టుకున్న నటి
Nusrat Bharucha has been seriously injured in an accident
బాలీవుడ్ నటి నుస్రత్ భారుచా ఇండోనేషియాలోని బాలిలో జరిగిన ఒక ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, వెన్నుపూస విరగడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ బాలీవుడ్ బ్యూటీ తదుపరి వైద్యం - శస్త్రచికిత్స కోసం ముంబైకి ఎయిర్ అంబులెన్స్‌లో తరలించడానికి ఆమె బృందం ఏర్పాట్లు చేస్తోంది. ఈ గాయం కారణంగా కొన్ని వారాల పాటు తన వృత్తిపరమైన కార్యక్రమాలకు దూరంగా ఉండనున్నారు.
సినిమా రంగంలో ఇలా ప్రమాదాల బారిన పడిన నటీమణులు నుస్రత్ ఒక్కరే కాదు. టాలీవుడ్ నటి నభా నటేష్ కూడా గతంలో ఒక ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి.. పూర్తిగా కోలుకోవడానికి చాలా కాలమే పట్టింది.
సమంత, రష్మికకు ఇటీవల గాయాలవ్వడంతో కోలుకోవడానికి సమయం పట్టింది. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ , మాలీవుడ్ చిత్ర పరిశ్రమలలో షూటింగ్ లొకేషన్లలో సాహస సన్నివేశాలు చేసేటప్పుడు లేదా ఇతర వ్యక్తిగత పనులపై వెళ్లేసమయంలో చాలా మంది ప్రముఖ నాయికలు ఊహించని ప్రమాదాలకు గురై తీవ్ర గాయాలపాలైన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.















































