శ్రీకాంత్ తో చిరంజీవి వెనక్కి తగ్గే ఛాన్స్ ఉందా?
Chiranjeevi-Srikanth Odela Combo: Fate to Be Decidedమెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఓ సినిమా లాక్ అయిన సంగతి తెలిసిందే. `దసరా` లాంటి మాస్ హిట్ తర్వాత శ్రీకాంత్ నుంచి అనౌన్స్ మెంట్ రావడంతో చిరంజీవితో అంతకు మించిన మాస్ సినిమా ఏస్తున్నారనే ప్రచారం జోరుగా సాగింది. అయితే తాజాగా శ్రీకాంత్ దర్శత్వంలో విడుదలైన `ది ప్యారడైజ్` తో అంచనాలు తల్లకిందులు అవ్వడంతో సన్నివేశం రివర్స్ అవుతున్నట్లు కనిపిస్తోంది.
పరాజయం తర్వాత యువ దర్శకుడితో అగ్ర హీరోలు ప్రయోగాలు చేసేందుకు వెనకడుగు వేస్తారనే సాధారణ సెంటిమెంట్ తెరపైకి వస్తోంది. శ్రీకాంత్ ఓదెల రాసుకున్న కథ మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నా? ట్రెండ్‌కు తగినట్లుగా స్క్రిప్ట్‌లో మార్పులు చేయాలని మెగా కాంపౌండ్ భావిస్తున్నట్లు సమాచారం. డైరెక్టర్ ప్రతిభపై నమ్మకం ఉన్నా? భారీ బడ్జెట్‌తో తెరకెక్కే మెగా ప్రాజెక్ట్‌ను హ్యాండిల్ చేసే విషయంలో నిర్మాతల్లో కూడా కొంత ఆందోళన మొదలైందనే ప్రచారం జరుగుతోంది.
అలాగని ఒక ఫ్లాప్ ఇచ్చినంత మాత్రాన టాలెంటెడ్ డైరెక్టర్‌ను చిరంజీవి పక్కన పెడతారని చెప్పలేం. శ్రీకాంత్ ఓదెల మేకింగ్ స్టైల్, యాక్షన్ సీన్లను ఎలివేట్ చేసే విధానంపై చిరంజీవికి పూర్తి అవగాహన ఉంది. `దసరా` చిత్రంలో ఆయన చూపించిన డెప్త్, ఎమోషనల్ కనెక్ట్ మెగాస్టార్‌ను ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో బాస్ పిలిచి మరీ ఛాన్స్ ఇచ్చారు. కాబట్టి కథలో లోపాలను సరిదిద్దుకుని, మరింత పకడ్బందీగా స్క్రిప్ట్‌ను సిద్ధం చేసే అవకాశాలున్నాయి.















































