విడాకులపై నటి కాజల్ అగర్వాల్ ఆవేదన
Kajal's Comments On Divorce
కొన్నాళ్లుగా పెళ్లిళ్లు ఎంత వేగంగా చేసుకుంటున్నారో అంతే వేగంగా విడాకులు తీసుకుంటున్నారు. చిన్న వయసులో పెళ్లిళ్లు విడాకులకు దారితీస్తాయంటారు. ప్రేమ పెళ్లి లేదు, పెద్దలు కుదిర్చిన వివాహము లేదు. చిన్న మాట పట్టింపుకే దంపతులు డివోర్స్ ఫైల్ చేసుకుని విడిపోతున్నారు.
కేవలం సామాన్య ప్రజలే కాదు, సెలబ్రిటీస్ కూడా ఏళ్లకు తరబడి సంసార జీవితంలో కొనసాగి, తర్వాత విడాకులు తీసుకుని తమకు పుట్టిన పిల్లలను అయోమయానికి గురి చేస్తున్నారు. తాజాగా ఈ విడాకుల కల్చర్ పై నటి కాజల్ అగర్వాల్ ఆవేదన వ్యక్తం చేసారు. మనుషుల మద్యన ఫోన్ అనే చిన్న పరికరం విడాకులకు ఎక్కువగా కారణమవుతుంది. ఆ ఫోన్ లో సోషల్ మీడియాని వినియోగించేవారు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ ఫోన్ వలన భార్య భర్తల మద్యన మాటలు తగ్గిపోయాయి.
కలిసి బయటకి వెళ్లి లైక్ లంచ్ కి, డిన్నర్ కి ఇలా ఎక్కడికి వెళ్లినా మాటలు తగ్గిపోయి ఫోన్ లకే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అదే విడాకులకు దారి తీస్తుంది. ఒకరినొకరు ఓదార్చుకోవడం, ప్రేమతో మాట్లాడే నాలుగు మాటలు కరువవుతున్నాయి. ఒకరికొకరు సమయం ఇచ్చుకోకపోవడం వల్లే బంధాలు దూరమవుతున్నాయి.
నేను ఖాళీ సమయంలో నా భర్త తో గడుపుతా, కలిసి రెస్టారెంట్స్ కి వెళతాను, ఫోన్స్ పక్కనపెట్టి ప్రశాంతంగా మాట్లాడుకుంటాం, నేను నా హస్బెండ్ ఇద్దరూ సమయానికి విలువనిస్తాం అంటూ కాజల్ అగర్వాల్ సమాజానికి ఉపయోగపడే కామెంట్స్ చేసారు.
















































