వారణాసిపై కీలక అప్ డేట్

Key Update on Varanasi Key Update on Varanasi

 

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న వారణాసి చిత్రం కీలక దశలోకి ఎంటర్ అయ్యింది. షూటింగ్ ఆల్మోస్ట్ పూర్తయినట్లుగా తెలుస్తుంది. వారణాసి లో అత్యంత కీలకమైన రామాయణ ఎపిసోడ్ కి సంబందించిన గ్రాఫిక్స్ వర్క్ పూర్తైంది అని తెలుస్తుంది.

మహేష్ రాముడిగా కనిపించే ఈ ఎపిసోడ్‌లోని యుద్ధ సన్నివేశం విజువల్స్‌ ఎఫెక్ట్స్ ని చూసి దర్శకుడు రాజమౌళి పూర్తిగా శాటిస్ఫాయ్ అయినట్లుగా సమాచారం. ఇక వారణాసి షూటింగ్ దాదాపు పూర్తికాగా.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లో భాగంగా VFX, రీ-రికార్డింగ్ పనులు శరవేగంగా సాగుతున్నాయి.

వారణాసి 2027 ఏప్రిల్ లో ఖచ్చితంగా విడుదల చెయ్యాలని స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యి దానికి అనుగుణంగా షూటింగ్, అలాగే పోస్ట్ ప్రొడక్షన్ అన్ని పూర్తి చేస్తున్నారు. 

Interesting update on Varanasi