హీరోల ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ
Nandamuri Balakrishna Injured On NBK111 Sets
టాలీవుడ్ హీరోలు ఒక్కొక్కరిగా సెట్ పైకి వెళ్ళబోతున్నారు. వరస ప్రమాదాల్లో దెబ్బలు తగిలించుకుని ఆసుపత్రి పాలవడమే కాదు.. ఆరు నుంచి ఎనిమిది వారాల రెస్ట్ లో ఉన్న హీరో-హీరోయిన్స్ అంతా ఒక్కొక్కరిగా తమ తమ సినిమాల సెట్ పైకి వెళుతున్నారు. మైసా సెట్ లో ప్రమాదం బారిన పడిన రష్మిక ఇప్పటికే రణబాలి షూటింగ్ లో పాల్గొని తన కేరెక్టర్ షూట్ పూర్తి చేసింది.
ఇక నందమూరి బాలకృష్ణ కూడా మోకాలి సర్జరీ నుంచి నెమ్మదిగా కోలుకుని దాదా షూటింగ్ కోసం రెడీ అవుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కూడా రేపో మాపో ప్రశాంత్ నీల్ తో చేస్తున్న డ్రాగన్ సెట్ లోకి వెళ్ళబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక మెగా హీరో రామ్ చరణ్ కూడా మణికట్టు సర్జరీ నుంచి కోలుకుంటున్నారు.
రామ్ చరణ్ దర్శకుడు సుకుమార్ తో కలిసి RC 17 ని మొదలు పెట్టేందుకు సన్నద్ధమవుతున్నారు తెలుస్తుంది. ఇక పవన్ కళ్యాణ్ కేరళం లో ఆయుర్వేద చికిత్స తీసుకుంటున్నారు. ఆయన రాగానే OG 2 ని మొదలు పెట్టేందుకు దర్శకుడు సుజిత్ రెడీ అవుతున్నారు. మరి హీరోలు కోలుకుని షూటింగ్స్ తో బిజీగా మారితే అభిమానులకు హ్యాపీ నే కదా..!
















































