ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Dhanush's OM - Vinayagar Chathurthi Special Poster

తగ్గేదేలే అంటున్న ధనుష్

Dhanush's OM - Vinayagar Chathurthi Special PosterDhanush's OM - Vinayagar Chathurthi Special Poster


కోలీవుడ్ స్టార్ హీరో అక్టోబర్ 16 నుంచి తమ ఓం చిత్రాన్ని వాయిదా వేస్తున్నారనే ఉహాగానాలు కోలీవుడ్ నుంచి టాలీవుడ్ మీడియా సర్కిల్స్ లో చక్కర్లు కొట్టాయి. దానితో సూపర్ స్టార్ రజినీకాంత్ జైలర్ చిత్రానికి ఓం దారిస్తుంది. మామ కోసం మాజీ అల్లుడు త్యాగమంటూ ఏదేదో మట్లాడుకున్నారు.

కానీ ధనుష్ మాత్రం అక్టోబర్ 16 నుంచి తగ్గేదేలే అంటున్నారు. అక్టోబర్ 16 న పక్కాగా ఓం విడుదల అంటూ మరోసారి కన్ ఫర్మ్ చేసారు. వినాయకచవితి ఫెస్టివల్ సందర్భంగా ఓం నుంచి మరోసారి రిలీజ్ డేట్ పై స్పష్టత నిస్తూ పవర్ ఫుల్ పోస్టర్ వదిలారు మేకర్స్. ధనుష్ వినాయకుడికి పూజిస్తూ పాటేసుకుంటున్న పోస్టర్ అది.

సో అక్టోబర్ 16 దసరా బరిలో ధనుష్ ఓం ఉంటుంది. ఇది ఫిక్స్. మరి జైలర్ 2, విజయ్ దేవరకొండ రణబాలి చిత్రాలు కూడా అదే డేట్ కి రాబోతున్నాయి. ఈ హాట్ బరిలో దసరా విన్నర్ ఎవరో చూసేందుకు ఆడియన్స్ ఇంట్రెస్టింగ్ గా ఉన్నారు.

Dhanush's OM