దుల్కర్ సినిమా: ఎందుకింత సైలెంట్

Dulquer I'm Game gameDulquer I'm Game game

 

టాలీవుడ్ లో మలయాళ స్టార్ హీరో దుల్కర్ కి ఉన్న క్రేజ్ మరే ఇతర మలయాళ హీరోకి లేదు. మహానటి తర్వాత దుల్కర్ పై తెలుగోళ్లు ప్రత్యేకమైన అభిమానం చూపిస్తున్నారు. అందుకే దుల్కర్ కూడా తెలుగు దర్శకులతో ఎక్కువ సినిమాలు చేస్తున్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ చేసిన లక్కీ భాస్కర్ ఎంత పెద్ద హిట్టో అందరికి తెలుసు.

ఇప్పుడు కూడా దుల్కర్ అచ్చమైన, స్వచ్ఛమైన తెలుగు టైటిల్ శ్రీ శ్రీ అంటూ పూజ హెగ్డే తో తెలుగు సినిమా చేస్తున్నారు. ఇలాంటి సమయంలో దుల్కర్ సల్మాన్ నటించిన మలయాళ మూవీ తెలుగులో విడుదలకు సిద్ధమవుతుంటే ఎంత హడావిడి ఉండాలి. కానీ దుల్కర్ మూవీ ఐ యామ్ గేమ్ పై తెలుగులో ఎలాంటి ఆసక్తి కనిపించడం లేదు.

కారణం ప్రమోషన్స్ లేవు. ఈ సినిమా ఈ వారం రిలీజ్ ఉంది అనేది కూడా చాలామందికి తెలియదు. ఓ ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసేసి చేతులు దులిపేసుకున్నారు మేకర్స్. ఐ యామ్ గేమ్ ఇప్పటికే పలుమార్లు రిలీజ్ తేదీలు మార్చుకుని ఫైనల్ గా ఈ నెల 4 న విడుదల సిద్దమైంది. కానీ తెలుగులో ఈ ఐ యామ్ గేమ్ సౌండ్ మాత్రం వినిపించడమే లేదు.

Dulquer Salmaan I'm Game game