టాక్సిక్ వదిలేసి రామాయణపై ఫోకస్ పెట్టండి
Leave Toxic behind and focus on the Ramayana
హీరో యశ్ లేటెస్ట్ మూవీ టాక్సిక్. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ ఘోరమైన పరాజయాన్ని మూటగట్టుకుంది. వారం తిరగకుండానే టాక్సిక్ థియేటర్స్ క్లోజ్ అయ్యాయి. టాక్సిక్ థియేటర్స్ లో ఆడియన్స్ కనిపిస్తే ఒట్టు. అంతలా పాన్ ఇండియా ప్రేక్షకులను టాక్సిక్ భయపెట్టింది. టాక్సిక్ పై సోషల్ మీడియాలో కనిపిస్తున్న కామెంట్లు యశ్ అభిమానులను తీవ్ర నిరాశలోకి నెడుతున్నాయి.
అయితే ఇప్పుడు యశ్ అభిమానులకు నెటిజెన్స్ ఒకటే చెబుతున్నారు. యశ్ నటించిన టాక్సిక్ మూవీ గురించి వదిలెయ్యండి.. ఇకపై యష్ నటించిన రామాయణ పై హోప్స్ పెట్టుకోండి. దాని గురించి అలోచించి ఫోకస్ పెట్టమని సలహా ఇస్తున్నారు. యశ్ రావణ్ గా నటించిన రామాయణ చిత్రం దీపావళికి విడుదల కానుంది.
మేకర్స్ భారీ ఎత్తున రామాయణ ప్రమోషన్స్ మొదలు పెడుతున్నారు. ఈ చిత్రంలో రావణ్ గా యాష్ లుక్స్, ఆయన పాత్ర తీరుకి ఇప్పటికే అభిమానులు సర్ ప్రైజ్ అయ్యారు. ఈ చిత్రంలో రామాయణ నిర్మాణంలో యశ్ వన్ ఆఫ్ ద నిర్మాత. అందుకే ఈ చిత్రం పై యశ్ అభిమానులు హోప్స్ పెట్టుకోవాల్సిందే.







































