ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Konda Surekha Ties Gold Rakhi to CM Revanth Reddy

రాఖి కట్టి బుట్టలో వేసారా?

Konda Surekha Ties Gold Rakhi to CM Revanth ReddyKonda Surekha Ties Gold Rakhi to CM Revanth Reddy


తెలంగాణ లేడీ మినిస్టర్ కొండా సురేఖ కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యంగా రేవంత్ రెడ్డి కి కొరకరాని కొయ్యగా తయారైంది. ఆవిడ నటి సమంత, కేటీఆర్, అక్కినేని ఫ్యామిలీ పై చేసిన కామెంట్స్ తో కోర్టు చుట్టూ తిరగాల్సిన అగత్యం ఏర్పడింది. ఆతర్వాత సారీ తో సరిపెట్టింది.

ఇప్పుడు ఆమె కుమార్తె ఏకంగా సీఎం రేవంత్ రెడ్డినే టార్గెట్ చెయ్యడంతో కాంగ్రెస్ అధిష్టానం కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తప్పించడానికి సిద్దమయిన నేపథ్యంలో సురేఖ భర్త కొండా మురళి రాయబారం మొదలు పెట్టారు. అధిష్టానం కొండా సురేఖ పై ఎలాంటి యాక్షన్ తీసుకోబోతుందో అన్న నేపథ్యంలో అధికారిక కార్యక్రమాల్లో సురేఖ పేరు, ఫొటో కూడా కనిపించడం లేదు.

సురేఖ కూడా గతకొన్ని రోజులుగా నియోజకవర్గాన్ని వదిలి రావడం లేదు. కానీ నేడు సురేఖ రాఖీ పండుగ రోజు హైదరాబాద్ వచ్చి సీఎం ఇంటికి వెళ్ళి బంగారు రాఖీ కట్టడం హాట్ టాపిక్ అయ్యింది. రాఖీ పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి మహిళా మంత్రులు సీతక్క, కొండా సురేఖ లు రాఖీ కట్టారు.

అయితే ఈ బంగారు రాఖీ తో సురేఖ తనపై రేవంత్ రెడ్డి కి కోపం పోయేలా చెయ్యడంలో ఎంతవరకు సక్సెస్ అయ్యిందో అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. ఈ మొత్తం వ్యవహారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఎక్కడా కొండా సురేఖను పల్లెత్తి మాట అనలేదు, అంతా అధిష్టానమే చూసుకుంటుంది అని చెప్పారు. 
 

Konda Surekha Ties Gold Rakhi to CM Revanth Reddy