ట్రోలర్లకు రుక్మిణి వసంత్ ఫ్యాన్స్ కౌంటర్!
Rukmini Vasanth's fans hit back at trolls!రాకింగ్ స్టార్ యష్ హీరోగా గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో విడుదలైన పాన్ ఇండియా చిత్రం `టాక్సిక్` బోల్డ్ కంటెంట్ తో ఎంత సంచలనమైందో తెలిసిందే. సినిమాలో ఇంటిమేట్ సీన్లతో వెడెక్కడంతో సదరు భామలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రత్యేకించి చిత్రంలో కీలక పాత్ర పోషించిన యంగ్ టాలెంటెడ్ హీరోయిన్ రుక్మిణి వసంత్ నటనపై సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు మోరల్ పోలీసింగ్‌కు పాల్పడుతూ ట్రోల్స్ చేశారు. అయితే ఈ విమర్శలను రుక్మిణి అభిమానులు తిప్పికొట్టారు.
సినిమాలో రుక్మిణి వసంత్ పాత్రను తప్పుబడుతూ జరుగుతున్న తప్పుడు ప్రచారంపై ఫ్యాన్స్ ఘాటుగా స్పందించారు. సినిమాలో ఎలాంటి కిస్సింగ్ లేదా లవ్మేకింగ్ సీన్స్ లేవని, కావాలనే కొందరు ఆన్లైన్లో తప్పుడు వక్రీకరణలతో ట్రోల్స్ చేస్తున్నారని మండిపడ్డారు. కేవలం అటెన్షన్ కోసం ఇలాంటి దిగజారుడు ప్రవర్తన ప్రదర్శించడం క్లౌన్ బిహేవియర్ అంటూ సోషల్ మీడియా వేదికగా ట్రోలర్లకు గట్టి కౌంటర్ ఇస్తున్నారు.
నటిగా ప్రతిభను చాటుకుంటూ వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటున్న రుక్మిణి వసంత్‌కు అండగా నిలుస్తూ ఫ్యాన్స్ పెట్టిన పోస్టులు నెట్టింట వైరల్ అవుతున్నాయి. సినిమాను సినిమా లాగా చూడాలని, నటీమణులపై నిరాధారమైన ఆరోపణలు చేయడం మానుకోవాలని హితవు పలికారు.







































