అగ్ర హీరోల స్నేహంపై వైరల్ అవుతున్న పోస్ట్!
Aamir Khan shares special note for SM, SDబాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ తాజాగా ప్రాజెక్ట్ `7 డాగ్స్` విడుదల సమయానికి సంబంధించి ఆసక్తి కరమైన నోట్‌ను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన తన ప్రియమైన స్నేహితులు, తోటి స్టార్ హీరోలు సల్మాన్ ఖాన్, సంజయ్ దత్, సౌదీ అరేబియా జనరల్ ఎంటర్టైనర్మెంట్ అథారిటీ ఛైర్మన్ తుర్కి అల్-షేక్‌లకు కృతజ్ఞతలు తెలుపుతూ భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీలో వారి మధ్య ఉన్న అనుబంధాన్ని చాటుతున్న ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సినిమా రంగంలో ఎన్నో దశాబ్దాలుగా కలిసి ప్రయాణిస్తున్న సల్మాన్ ఖాన్ - సంజయ్ దత్ తన జీవితంలో ఎంత ముఖ్యమైనవారో అమీర్ ఖాన్ ఈ నోట్లో గుర్తు చేసుకున్నారు. కష్టసుఖాలలో ఒకరికొకరు తోడుగా నిలిచిన ముగ్గురు దిగ్గజ నటులు మరోసారి తమ స్నేహబంధం తో వార్తల్లో నిలిచారు. అలాగే గ్లోబల్ ఎంటర్టైనర్మెంట్ రంగంలో అద్భుతమైన మార్పులు తీసుకువస్తున్న తుర్కి అల్-షేక్ అందించిన సహకారాన్ని కూడా అమీర్ ఖాన్ ప్రత్యేకంగా అభినందించారు. ముగ్గురు ఎంతో కాలంగా అన్నదమ్ములా కలిసి ఉంటున్నామని..ఒకరి కష్ట సుఖాలు మరోకరు పంచుకుంటామని నోట్ లో పేర్కొన్నారు. ఆ బాండింగ్ తమ మధ్య ఎప్పటికీ పదిలంగానే ఉంటుందన్నారు.
`7 డాగ్స్` చిత్రంపై ఇప్పటికే ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. విభిన్నమైన కథాంశంతో తెరకెక్కుతున్న సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా అమీర్ ఖాన్ పంచుకున్న స్పెషల్ నోట్ సినిమాపై మరింత హైప్‌ను క్రియేట్ చేస్తోంది. చిత్ర పరిశ్రమలోని ప్రముఖులంతా ఒకరి విజయాలను మరొకరు అభినందించుకోవడం ఈ బంధాన్ని మరింత బలపరుస్తోందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.







































