సెట్ లోకి వెళ్లేందుకు బాలయ్య తొందర

NBK 111 - Balakrishna


నందమూరి బాలకృష్ణ NBK 111 సెట్ లో గాయపడి హైదరాబాద్ AIG ఆసుపత్రిలో మోకాలి సర్జరీ చేయించుకుని ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. సర్జరీ జరిగాక దాదాపుగా ఎనిమిదివారాల పాటు బాలయ్య రెస్ట్ లో ఉండాలని చెప్పారు. ఈలోపు బాలయ్య మోకాలి కి ఫిజియోథెరపీ చేసి పూర్తిగా రికవరీ అయ్యాకే బాలయ్య సినిమా షూటింగ్స్ కి వెళతారని అనుకున్నారు.

బాలయ్య మాత్రం ఎప్పుడెప్పుడు NBK 111 సెట్ లోకి వెళ్లిపోదామా అని చూస్తున్నారట. మోకాలి సర్జరీ నుంచి  త్వరగా కోలుకుని ఆయన షూటింగ్ లో జాయిన్ అవ్వాలని చూస్తున్నారట. కొన్నాళ్లుగా సినిమా షూటింగ్స్ కి బాలయ్య బ్రేక్ ఇవ్వడం లేదు. ఒక సినిమా రిలీజ్ కి ముందే మరో సినిమా ని లైన్ పెడుతున్నారు.

అలాంటి బాలయ్య షూటింగ్ కి బ్రేకిచ్చి ఇంట్లో రెస్ట్ తీసుకొవడం ఆయనకు నచ్చడం లేదు. మోకాలి పూర్తిగా రికవరీ అయ్యేవరకు ఆయనకు విశ్రాంతి తప్పదు. కానీ బాలయ్య మాత్రం చిన్నపిల్లాడిగా త్వరగా కోలుకుని షూటింగ్ కే వెళ్లిపోవాలని తొందరపడుతున్నట్టుగా సన్నిహితుల సమాచారం.
 

Balakrishna