నటి అనసూయ పై కేసు నమోదు
Anasuya Faces Legal Trouble
ఎప్పుడు ఏదో ఒక కాంట్రవర్సీలో ఇరుక్కునే యాంకర్ కమ్ నటి అనసూయ మరోసారి వివాదంలో నిలిచింది. అనసూయ హిందూ మతంపై అనుచిత వ్యాఖ్యలు చేసారంటూ ఆమెపై హిందువులు ముఖ్యంగా బిజెపి పార్టీ నేతలు, కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా ఫైర్ అవుతున్నారు.
ఈ వివాదంపై ఇప్పటికే అనసూయ క్లారిటీ ఇచ్చింది. తన మాటలను కొంతమంది ఎడిట్ చేసి వక్రీకరిస్తున్నారని, తనను తాను హనుమంతుడి కుమార్తెగా భావిస్తానని.. ఆయన భక్తి, ధైర్యం, సామర్థ్యం, తెగింపు తనకు ఎప్పుడూ స్ఫూర్తి అని అనసూయ ఈ వివాదంపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది.
అయితే అన్యాయం జరిగినప్పుడు మాట్లాడకుండా ఉండడం తన స్వభావం కాదని, ఎవరు ఏ మతానికి చెందినవారైనా.. అసభ్యకరంగా మాట్లాడకూడదని అనసూయ చెప్పుకొచ్చింది. తాజాగా హైదరాబాద్లోని బోరబండ పోలీస్ స్టేషన్లో స్థానిక బీజేపీ నాయకులు అనసూయ పై కేసు పెట్టడం హాట్ టాపిక్ అయ్యింది
అనసూయ కామెంట్స్ హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయని, ఆమెపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని పోలీసులను బిజెపి నేతలు కోరారు.







































