మార్పు మంచికే
Ravi Teja on attending functions and interviews at Irumudi
మాస్ మహారాజ్ రవితేజ లో మార్పు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఒకప్పుడు ప్రమోషన్స్ ని తప్పించుకునే రవితేజ గత రెండు సినిమాల నుంచి ప్రమోషన్స్ లో ఇన్వాల్వ్ అవుతున్నారు. వరస సినిమాల వైఫల్యాలు రవితేజ లో చాలా మార్పుని తీసుకొచ్చింది అనేది జగమెరిగిన సత్యం. అటు రవితేజ మర్కెట్ కూడా బాగా పడిపోయింది.
లేటెస్ట్ గా ఆయన నటించిన ఇరుముడి చిత్రం రేపు శుక్రవారమే అంటే ఆగస్టు 21 నే విడుదల కాబోతుంది. ఇరుముడి ప్రమోషన్స్ లో రవితేజ గత వారం రోజులుగా తెగ హడావిడి చేస్తున్నారు. భీమవరం ఈవెంట్, హైదరాబాద్ ప్రీ రిలీజ్ ఈవెంట్, సుమ ఇంటర్వ్యూ అబ్బో రవితేజ మీడియాలోనే కనిపిస్తున్నారు.
మరి ఈ హడావిడి ఇరుముడి కి భారీ ఓపెనింగ్స్ తేవాలి. అప్పుడే రవితేజ స్టామినా ప్రూవ్ అవుతుంది. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఇరుముడి పై పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ఆడియన్స్ లోను ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ పై ఆసక్తి కనిపిస్తుంది. ట్రేడ్ లోను బజ్ కనిపిస్తుంది.
ఇరుముడి టాక్ కన్నా ముందే మంచి ఓపెనింగ్స్ తెచ్చుకుంటే రవితేజ సేఫ్. అంటే ఇప్పుడు రవితేజ కష్టం ఇరుముడి ఓపెనింగ్స్ లో కనిపించాల్సిందే. భర్త మహాశయులకు బెటర్ టాక్ వచ్చినా అది సంక్రాంతి హిట్ సినిమాల నడుమ నలిగిపోయింది. ఈసారి ఇరుముడి కి ఎలాంటి పోటీ లేదు. సో రవితేజ కి అన్ని అలా కలిసొచ్చేలా ఉన్నాయి.







































