బిగ్ బాస్ అగ్నిపరీక్షపై తీవ్ర విమర్శలు
Agnipariksha: Uppal Balu reacts strongly to his elimination from the auditions
బిగ్ బాస్ సీజన్ 9 అప్పుడు కంటెస్టెంట్స్ లేక అగ్నిపరీక్ష అంటూ కామన్ మ్యాన్స్ ని హౌస్ లోకి తీసుకొచ్చారు. ఆరుగురు ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సెర్స్ ని బిగ్ బాస్ హౌస్ లోకి తెచ్చెందుకు అగ్నిపరీక్ష పెట్టారు. అభిజిత్, నవదీప్, బిందు మాధవి లు జెడ్జి లుగా ఈ అగ్నిపరీక్ష సీజన్ 1 జరిగింది.
ఇప్పుడు బిగ్ బాస్ కోసం అగ్నిపరీక్ష సీజన్ 2 స్టార్ట్ చేసారు. రేపు శనివారం నుంచి స్టార్ మా లో అగ్నిపరీక్ష సీజన్ 2 ప్రారంభం కాబోతుంది. ఈ సీజన్ అగ్నిపరీక్ష 2 కోసం కంటెస్టెంట్స్ ఎంపిక సాగింది. అయితే ఈ అగ్నిపరీక్ష 2 లో ఫెయిల్ అయిన వారు బయట యూట్యూబ్ ఛానల్స్ లో కూర్చుని అభిజిత్, స్టార్ మా, నవదీప్, బిందు మాధవీలపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
ఉప్పల్ బాలు, ఇలా చాలామంది రిజెక్ట్ అయిన వారు అగ్నిపరీక్ష నుంచి మమ్మల్ని రిజెక్టు చెయ్యడానికి వాళ్లెవరు, అగ్నిపరీక్షకు పిలిచి అవమానించారు, మాలో టాలెంట్ ఉంది కానీ మమ్మల్ని ఎంపిక చెయ్యలేదు అంటూ యూట్యూబ్ లో ఇంటర్వూస్ ఇస్తున్నారు. అగ్నిపరీక్ష ఫేక్ అంటూ వారు ఇచ్చే ఇంటర్వూస్ లో విమర్హ్సించడం హాట్ టాపిక్ అయ్యింది.







































