ఆగష్టు సెకండ్ వీక్-ఐదు సినిమాలు
Theatrical Releases This Week
ఆగష్టు రెండో వారం బాక్సాఫీసు దగ్గర ఇంట్రెస్టింగ్ ఫైట్ కి అంతా రెడీ. ఆగష్టు 14 న ఏకంగా ఐదు సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ వారం విడుదలైన కొరియన్ కనకరాజు, లోకేష్ కనగరాజ్ డబ్బింగ్ మూవీ డీసీ చిత్రాలు థియేటర్స్ లో కళకళలాడే కలెక్షన్స్ తో ప్రేక్షకులను ఇంప్రెస్స్ చేస్తున్నాయి.
ఇక ఆగస్టు రెండో వారం ఐదు సినిమాలు బాక్సాఫీసు పోటీకి దిగుతున్నాయి. వెంకీ అట్లూరి-సూర్య ల విశ్వనాథ్ అండ్ సన్ విడుదలవుతుంది. ప్రస్తుతం ఈ చిత్రంపై ట్రేడ్ లోనే కాదు ప్రేక్షకుల్లోనూ మంచి బజ్ కనిపిస్తుంది. తెలుగు డైరెక్టర్-కోలీవుడ్ హీరో ఈ సినిమా డైరెక్ట్ గా తమిళ్ లోనే తెరకెక్కి తెలుగులోనూ క్రేజీగా రిలీజ్ కాబోతుంది.
ఆతర్వాత విశాల్ మకుటం డబ్బింగ్ మూవీ కూడా ఈ శుక్రవారమే విడుదల కాబోతుంది. అలాగే ఎంఎస్ రాజు అగథ, అన్నపూర్ణ స్టూడియోస్ పళ్ల బురుసు, హుషారు పిట్టలు చిత్రాలు థియేటర్ లో విడుదలకు సిద్ధమయ్యాయి. అన్నిట్లో విశ్వనాథ్ అండ్ సన్స్ పై అందరిలో చాలా ఆసక్తి కనిపిస్తుంది.






































