మెగాస్టార్ సినిమాలో క్రేజీ హీరోయిన్

Meenakshi Chaudhary With Mega StarMeenakshi Chaudhary With Mega Star

 

ప్రస్తుతం క్రేజీ హీరోయిన్ గా టాలీవుడ్ హీరోలతో జోడి కడుతున్న మీనాక్షి చౌదరి ఛాన్స్ వస్తే సీనియర్ హీరోలతోనూ రొమాన్స్ చేస్తుంది. టాలీవుడ్ లో ఈ భామ నాగ చైతన్య వృషకర్మ చిత్రంలో నటిస్తుంది. మరోపక్క తమిళ ఇండస్ట్రీలోను మీనాక్షి కి అవకాశాలు వస్తున్నాయి.

తాజాగా మీనాక్షి చౌదరి మెగాస్టార్ మూవీలో నటించబోతుంది అనే వార్త వైరల్ అవుతుంది. చిరంజీవి కెరీర్‌లో 158వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ సినిమా కొల్లి బాబీ దర్శకత్వంలో రూపొందుతుంది. ఈ చిత్రం షూటింగ్ ఆరంభం అయినప్పటినుంచి చాలా స్పీడు గా రెడీ అవుతుంది.

చిరు బర్త్ డే కి బ్లాస్టింగ్ ట్రీట్ కూడా దర్శకుడు బాబీ సిద్ధం చేస్తున్నారు. మెగా 158 లో సెకండ్ హాఫ్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ కోసం మెగాస్టార్ చిరంజీవి సరికొత్త లుక్ లో కనిపించబోతున్నాడు. ఈ ఫ్లాష్ బ్యాక్ లో చిరు పాత్ర మాఫియా నేపథ్యంలో ఉంటుందట. పైగా ఈ సినిమాలో మెగాస్టార్ పాత్రల్లో చాలా వేరియేషన్స్ ఉంటాయట. అయితే ఈ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో మీనాక్షి చౌదరి కనిపిస్తుంది అనే టాక్ వినబడుతుంది.

మరి చిరు తో మీనాక్షి రొమాన్స్ చేస్తుందా, లేదంటే మరేదన్నా పాత్రలో మీనాక్షి కనిపిస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. 

Meenakshi Chaudhary in Mega 158