ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Another heroine says goodbye to social media

అందుకే సోషల్ మీడియాకి బ్రేకిచ్ఛా-మమిత

Another heroine says goodbye to social media

సోషల్ మీడియాలో ఎంతగా పాపులర్ అవుతారో అంతే త్వరగా నెగెటివ్ ఫీడ్ బ్యాక్ ని అందుకుంటారు. హీరోయిన్స్ విషయమైనా, హీరోల విషయమైనా.. అసలెందుకు సీలెబ్రిటీస్ ఎవరైనా హిట్స్ ఉన్నప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అయితే ప్లాప్ పడగానే ట్రోల్ అవుతూ ఉంటారు. అలాగే కొంతమంది చేసే ట్రోల్స్ వలన మానసికంగా కుంగిపోతుంటారు.

అందుకే సెలబ్రిటీస్ కొన్ని కొన్నిసార్లు మానసిక ప్రశాంతత కోసం అంటూ సోషల్ మీడియాకి బ్రేక్ ఇస్తూ ఉంటారు. ఈమధ్యనే అంటే ఘాటీ రిజల్ట్ తర్వాత అనుష్క సోషల్ మీడియా నుంచి బ్రేక్ తీసుకుంది. ఆ లిస్ట్ లో మరో హీరోయిన్ చేరింది.

ఆమె విశ్వనాధ్ అండ్ సన్స్ తో త్వరలోనే ఆడియన్స్ ముందుకు రాబోతున్న మమిత బైజు. తాను సోషల్ మీడియాకి గుడ్ చెప్పినట్టుగా ఎప్పుడో ప్రకటించినా అది ఎందుకు అనేది ఇప్పుడు రివీల్ చేసింది. సోషల్ మీడియా ద్వారా వచ్చే పబ్లిసిటీ కంటే మానసిక ప్రశాంతతకే తాను ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని ఆమె చెప్పింది. ఇకపై వ్యక్తిగతంగా సోషల్ మీడియాలో సినిమా అప్డేట్స్ షేర్ చేయబోనని ఆమె స్పష్టం చేసింది.

ఇకపై తన సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ ను పీఆర్ టీమ్ ద్వారా వెల్లడిస్తానని మమిత బైజు స్పష్టం చేసింది. 

Mamitha Baiju takes a break from social media