డ్రాగన్ కోసం HYD లో దిగిన బాలీవుడ్ సింహం

Anil Kapoor lands for DragonAnil Kapoor lands for Dragon

 

యంగ్ టైగర్ ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కలయికలో పవర్ ఫుల్ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న డ్రాగన్ చిత్ర షూటింగ్ కి ఎన్టీఆర్ భుజానికి గాయమవడం వల్ల బ్రేక్ ఇచ్చారని కొంతమంది, లేదు ఎన్టీఆర్ లేని సీన్స్ ని నీల్ తెరకెక్కిస్తున్నారని కొంతమంది చెబుతున్న క్రమంలో డ్రాగన్ లో కీ రోల్ పోషిస్తున్న నటుడు ఒకరు హైదరాబాద్ లో అడుగుపెట్టారు.

ఎన్టీఆర్ డ్రాగన్ చిత్రంలో బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్ నటిస్తున్న విషయం తెలిసిందే. అనిల్ కపూర్ ఈరోజు బుధవారం హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో కనిపించారు. డ్రాగన్ షూటింగ్ కోసమే ఆయన హైదరాబాద్ వచ్చారు. అంటే ఎన్టీఆర్ కి ప్రమాదం జరిగినప్పటికీ డ్రాగన్ షూటింగ్ ఆగలేదు అనేగా దీనర్ధం.

ఎన్టీఆర్-నీల్ కలిసి వచ్చే ఏడాది జూన్ లో డ్రాగన్ ని ఆడియన్స్ ముందుకు దించాలని డిసైడ్ అయ్యారు. ఎన్టీఆర్ ఎనిమిదివారాల విశ్రాంతి తర్వాత డ్రాగన్ సెట్స్ లోకి వెళతారని, ఈలోపు నీల్ ఎన్టీఆర్ లేని సన్నివేశాలు పూర్తి చేస్తారని తెలుస్తుంది. 

Dragon on Track:AK lands