ఆ స్టార్ నిర్మాత చిత్రం ఆగిపోయిందా?
Naga Vamsi's biggie with this star not happening?సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ సినిమాల నిర్మాణంలో దూసుకుపోతున్నారు. వరుసగా స్టార్ హీరోలతో ప్రాజెక్ట్‌లను ప్లాన్ చేస్తూ ట్రేడ్ సర్కిల్స్‌లో నిత్యం బిజీగా ఉంటున్నారు. వైవిధ్యమైన కథలతో పాటు భారీ బడ్జెట్ సినిమాలను ప్రేక్షకులకు అందించడంలో వంశీ ఎప్పుడూ ముందుంటారు. స్టోరీల జడ్జిమెంట్ విషయంలోనూ వంశీకి మంచి ఇమేజ్ ఉంది. దిల్ రాజు తర్వాత స్టోరీలపై అంతటి పట్టున్న నిర్మాతగా వంశీకిఇ పేరుంది.
తాజాగా టాలీవుడ్ ఫిల్మ్ సర్కిల్స్‌లో ఓ ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది. నాగవంశీ నిర్మాణంలో ఓ ప్రముఖ స్టార్ హీరోతో చేయాల్సిన భారీ బడ్జెట్ చిత్రం కొన్ని కారణాల వల్ల ఆగిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. అనుకున్న సమయానికి స్క్రిప్ట్ వర్క్ పూర్తికాకపోవడం .. ఇతర క్రియేటివ్ విభేదాల కారణంగా ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతానికి హోల్డ్‌లో పడినట్లు సమాచారం.
ఈ వార్త లీక్ అవ్వడంతో సినీ వర్గాల్లో .. సోషల్ మీడియాలో రకరకాల చర్చలు మొదలయ్యాయి. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై అభిమానులు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్న తరుణంలో ఇలాంటి పరిణామం చోటుచేసుకోవడం నిరాశ కలిగించే విషయమే. అయితే ఈ ప్రచారంపైయూనిట్ గానీ, నిర్మాణ సంస్థ గానీ ఇంతవరకూ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.







































