అఫీషియల్: రూ.100 కోట్ల క్లబ్బులోకి అఖిల్
Finally Lenin scores a century
అఖిల్ అక్కినేని ఫైనల్ గా రూ.100 కోట్ల క్లబ్బులోకి మొదటిసారి అఫీషియల్ గా అడుగుపెట్టాడు. లెనిన్ చిత్రం రూ.100 కోట్ల పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలు అఖిల్ లెనిన్ తో రూ.100 కోట్ల క్లబ్బులోకి వెళ్తాడా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. కారణం లెనిన్ మేకర్స్ ప్రమోషన్స్ ఆపేసారు. అదే అభిమానులకు ఆగ్రహం తెప్పించింది.
లెనిన్ మూడు వారాలు పూర్తి చేసుకుని నాలుగో వారంలోకి ఎంటర్ అవడమే రూ.100 కోట్ల పోస్టర్ ని రిలీజ్ చేసారు మేకర్స్. దానితో అక్కినేని ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవు. అఖిల్ హీరోగా రూ.100 కోట్ల క్లబ్బులోకి ఎంటర్ అవడంతో అభిమానులు పట్టరాని సంతోషంలో మునిగిపోతున్నారు.
నాగ చైతన్య తండేల్ తో 100 కోట్లు కొట్టాడు, అఖిల్ లెనిన్ తో రూ.100 కోట్లు కొట్టాడు. సో అక్కినేని కుర్ర హీరోలు రూ.100 కోట్ల హీరోలుగా ప్రూవ్ చేసుకున్నారు. అదే అభిమానులు పండగ చేసుకునేలా చేసింది.







































