Advertisement

క్లాస్ కన్నా మాస్ బెటర్ అఖిల్

Akkineni Akhil

 

అక్కినేని అఖిల్ ఎట్టకేలకు కెరీర్ లో లెనిన్ తో మంచి హిట్ అందుకున్నాడు. బిగ్ హిట్ అనలేం కానీ.. అఖిల్ కెరీర్ లో లెనిన్ మొదటి హిట్ అనే చెప్పాలి. ఈ చిత్రంలో అఖిల్ మాస్ గా ఆకట్టుకున్నాడు. మాస్ లుక్ లో అభిమానులకు బాగా నచ్చేసాడు. కామన్ ఆడియన్స్ కూడా అఖిల్ ని మాస్ గానే చూసారు, నచ్చాడు.

గతంలో హలొ, మిస్టర్ మజ్ను, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రాల్లో అఖిల్ క్లాస్ గా కనిపించాడు. ఆ చిత్రాలు జస్ట్ యావరేజ్ గా మిగిలిపోయాయి. అఖిల్ క్లాస్ గా బావుంటాడు. మంచి లవ్ స్టోరీ పడితే అఖిల్ ఖచ్చితంగా హిట్ కొడతాడు. కానీ మాస్ గా అయితే త్వరగా ప్రేక్షకుల్లోకి వెళ్ళిపోతాడు.

సో లెనిన్ తర్వాత అఖిల్ మరో మాస్ కేరెక్టర్ ఎంచుకుంటే బావుంటుంది అనేది అభిమానుల కోరిక. మరి అఖిల్ నెక్స్ట్ ఏ డైరెక్టర్ తో ఎలాంటి సినిమా చేస్తాడు అనేది ఇప్పుడు అభిమానుల్లోనే కాదు కామన్ ప్రేక్షకుల్లోనూ కనిపిస్తున్న క్యూరియాసిటీ.

Akkineni Hero