Advertisement
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Pawan Kalyan Visits Meher Ramesh After His Sister's death

మెహర్ రమేష్ ని పరామర్శించిన పవన్

Pawan Kalyan Visits Meher Ramesh After His Sister's death


దర్శకుడు మెహర్ రమేష్ ఈమధ్యనే కుమార్తె మోహన వివాహాన్ని గ్రాండ్ గా నిర్వహించారు. మెగాస్టార్ చిరు దగ్గర నుంచి పలువురు సినీ ప్రముఖులు మెహర్ రమేష్ ఇంట పెళ్లి వేడుకలో సందడి చేసారు. అంత ఆనందంగా పెళ్లి వేడుకలు ముగించిన మెహర్ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది.

మెహర్ రమేష్ సోదరి నిన్న మంగళవారం రాత్రి మృతి చెందింది. గత 14 రోజులుగా వైరల్ న్యూమోనియాతో చికిత్స పొందుతున్న ఆమె విజయవాడలో మంగవాళం రాత్రి తుదిశ్వాస విడిచింది. మెహర్ రమేష్ సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ భావోద్వేగ పోస్ట్ పెట్టాడు. దానితో సినీప్రముఖులు తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు.

మెహర్ సోదరి మరణించిన విషయం తెలుసుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆసుపత్రికి వెళ్లి మెహర్ రమేష్ ని ఆయన ఫ్యామిలీని పరామర్శించారు. ఈమధ్యనే పవన్ కళ్యాణ్ కుడి భుజానికి సర్జరీ చేయించుకున్నారు. చేతికి బెల్ట్ వేసుకుని పవన్ ఆసుపత్రికి వెళ్లిన వీడియో వైరల్ అవుతోంది. 

Meher Ramesh Sister Passed Away