పవన్ పరామర్శకు వెళ్లిన నారా లోకేష్
Minister Nara Lokesh meets Pawan Kalyan
ముంబై ఆసుపత్రిలో కుడి భుజానికి ఆపరేషన్ చేయించుకుని హైదరాబాద్ ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను పరామర్శించి ఆయన ఆరోగ్యం గురించి తెలుసుకునేందుకు రాజకీయ ప్రముఖులు పవన్ ఇంటికి వెళుతున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు పవన్ ని ముంబై ఆసుపత్రిలోనే పరామర్శించి వస్తే.. మిగతా వారు హైదరాబాద్ ఇంటి దగ్గర పవన్ ని కలుస్తున్నారు.
ఈరోజు శనివారం మంత్రి నారా లోకేష్ పవన్ కళ్యాణ్ ని కలిసి ఆయన్ని పరామర్శించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడకముందే కలిసి 2024 ఎన్నికల్లో పోటీ చేసినప్పటినుంచి పవన్ కళ్యాణ్ ను లోకేష్ అన్నగా ట్రీట్ చెయ్యడమే కాదు.. ఎక్కడ కలిసినా వారిద్దరి అన్నదమ్ముల బాండింగ్ చూసి అటు టీడీపీ ఇటు జనసేన కార్యకర్తలు, అభిమానులు ఎంజాయ్ చేస్తున్నారు.
ఈరోజు పవన్ ని కలిసి ఆయన్ని ఆలింగనం చేసుకుని ఆరోగ్యం గురించి ఆరాతీసిన నారా లోకేష్ కాసేపు పవన్ తో గడిపి వెళ్లిపోయారు. ఇక ఈరోజు శనివారం ఉదయం పవన్ కళ్యాణ్ భార్య తిరుమల శ్రీవారిని సుప్రభాత సేవ సమయంలో దర్శించుకుని భర్త త్వరగా కోలుకోవాలని మొక్కు తీర్చుకున్నారు. అది కూడా ఆమె అలిపిరి మెట్ల మార్గం ద్వారా తిరుమల చేరుకొని శ్రీవారి దర్శనానికి వెళ్ళటం గమనార్హం.







































