వారణాసి లో ఆ యాక్షన్ సీక్వెన్స్ హైలైట్

Varanasi Shooting Update


ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ లు కలిసి నటిస్తున్న వారణాసి చిత్ర షూటింగ్ ని రాజమౌళి పరుగులుపెట్టిస్తున్నారు. పక్కా ప్రణాళికలతో వారణాసి షూటింగ్ చేస్తున్నారు. సెప్టెంబర్ చివరినాటికి వారణాసి షూటింగ్ కంప్లీట్ చేసేస్తామని రాజమౌళి నే చెప్పారు.

రుద్రా గా మహేష్, కుంభ గా పృథ్వీరాజ్ సుకుమారన్ మధ్యన కీలక సన్నివేశాలే కాదు.. వారి నడుమ వచ్చే ఫైట్ సీక్వెన్స్ కూడా సినిమాకి హైలెట్ గా నిలుస్తాయని తెలుస్తుంది. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో వేసిన భారీ కాశీ సెట్ లో కీలకమైన యాక్షన్ ఎపిసోడ్ ని రాజమౌళి తెరకెక్కిస్తున్నారట.

కాశీ-వారణాసి లో అఘోరులు శివుడిని, కాళీమాతను ఆరాధిస్తూ అత్యంత కఠినమైన ఆధ్యాత్మిక సాధనలు చేస్తుంటారు. దానికి సంబందించిన కీలక షెడ్యూల్ ని, అలాగే యాక్షన్ ఎపిసోడ్ ని రామోజీ ఫిలిం సిటీలో తెరకెక్కిస్తారట. అందులో భాగంగా ఓ రెండు రోజుల పాటు రిహార్సల్స్ చేశాకే వారణాసి లో అత్యంత కీలక యక్షన్ ఎపిసోడ్ ని చిత్రికరిస్తారని, దీని కోసం చాలామంది పాల్గొనబోతున్నారని తెలుస్తుంది.

Varanasi Movie