వారాణసి కోసం 14 నెలల పని-PC
Priyanka Chopra hypes up SS Rajamouli's Varanasi
పాన్ ఇండియా దర్శకుడు రాజమౌళి.. సూపర్ మహేష్ తో చేస్తున్న మూవీ వారణాసి. వారాణసి టైటిల్ రివీల్ తోనే సినిమాపై భారీ అంచనాలు పెంచేశారు. ఈ చిత్రంలో మహేష్ బాబు రుద్ర ఇంకా శ్రీరాముడి పాత్రలో నటిస్తుండగా.. పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభ పాత్రలో విలన్ గా కనిపించనున్నాడు. బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా మందాకినీ కేరెక్టర్ లో కనిపిస్తుంది.
తాజాగా ప్రియాంక చోప్రా వారణాసి షూటింగ్ పై చేసిన కామెంట్స్ నేషనల్ వైడ్ గా వైరల్ అవుతున్నాయి. నేను 14 నెలలుగా వారణాసి కోసం పనిచేస్తున్నాను. ఏ సినిమాను అయినా తెరకెక్కించడానికి రాజమౌళి చాలా సమయం తీసుకుంటారనే సంగతి మనందరికీ తెలిసిందే.
ప్రతి సీన్ ని చాలా కేర్ తీసుకుని చిత్రీకరిస్తారు. వారణాసి చిత్రంలో నేను అద్భుతమైన స్లో మోషన్ జంప్స్ చాలా చేశాను. ప్రస్తుతానికి ఇంతే చెప్పగలను, నేనింతకంటే వారణాసి గురించి ఎక్కువ చెప్పలేను అంటూ ప్రియాంక చోప్రా వారణాసి షూటింగ్ పై, అలాగే డైరెక్టర్ రాజమౌళిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.







































