ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Samantha's babymoon vacation with her husband.

భర్త తో సమంత బేబీమూన్ వెకేషన్

Samantha's babymoon vacation with her husband.


టాప్ హీరోయిన్ సమంత తన భర్త రాజ్ నిడిమోరు తో కలిసి వెకేషన్ లో ఎంజాయ్ చేస్తుంది. మా ఇంటి బంగారం తో రూ.100 కోట్ల క్లబ్బులో అడుగుపెట్టిన సమంత ఆ సక్సెస్ ని, అలాగే మాతృత్వాన్ని భర్త రాజ్ నిడిమోరుతో కలిసి థాయ్ ల్యాండ్ లో సెలెబ్రేట్ చేసుకుంటుంది. సమంత ప్రెగ్నెంట్. అయినా వ్యాయామాలు, యోగా అంటూ హెల్త్ ని పర్ఫెక్ట్ గా మైంటైన్ చేస్తుంది.

ఇక థాయ్ ల్యాండ్ లో సమంత భర్త తో కలిసి బీచ్ వెంట, అలాగే కాటేజ్ లో సేద తీరుతూ, యోగా చేస్తూ బేబిమూన్ వెకేషన్ ని ఎంజాయ్ చేస్తున్న ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. సమంత చాలా సంతోషంగా బేబీ బంప్ కనిపించేలా డ్రెస్ చేసుకుని నడిచొచ్చే వీడియో, అలాగే ఫొటోస్ వైరల్ అవుతున్నాయి.

ప్రస్తుతం హ్యాపీ మోడ్ లో సమంత తల్లి కాబోవడాన్ని ఆస్వాదిస్తోంది. సమంత కు నవంబర్ లేదా, డిసెంబర్ లో డెలివరీ అయ్యే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తుంది.

 

Samantha Ruth Prabhu heads to Thailand