బాలయ్య బాబు కి ఫ్యాన్స్ రిక్వెస్ట్
A request from fans to Balayya
నందమూరి నటసింహ బాలకృష్ణ కి నందమూరి అభిమానులు రిక్వెస్ట్ లు పెడుతున్నారు. కారణం మోక్షజ్ఞ సినీ ఎంట్రీ పై బాలయ్య ను ఏదో ఒకటి తేల్చమని అడుగుతున్నారు. ఈ సెప్టెంబర్ లో మోక్షజ్ఞ బర్త్ డే కి ఆయన నుంచి అదిరిపోయే అప్ డేట్ ప్లాన్ చెయ్యమనేది వారి కోరిక.
రెండేళ్ల క్రితం మోక్షజ్ఞ ఫస్ట్ సినిమా అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఇప్పటివరకు దాని ప్రోగ్రెస్ లేదు. ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఆతర్వాత మరో ప్రాజెక్ట్ విషయమై మోక్షు మనసు పెట్టడం లేదు, బాలయ్య కూడా తన సినిమాల పని చూసుకుంటున్నారు కానీ.. కొడుకు విషయంలో పట్టించుకున్నట్లుగా కనిపించడం లేదు.
కొడుకు మోక్షజ్ఞ సినీ తెరంగేట్రం పై బాలయ్య సీరియస్ గా ఉన్నారా, బాలయ్య ఉన్నా మోక్షు లేడా ఇదే అభిమానుల్లో ఉన్న అనుమానం. మొదట ప్రాజెక్ట్ అనౌన్సమెంట్ అప్పుడు హీరో మెటీరియల్ అంటే ఇలానే ఉండాలి అనేలా మోక్షజ్ఞ మేకోవర్ అయ్యాడు. ఆతర్వాత ఒకటిరెండుసార్లు తప్ప ఈ రెండేళ్లలో మోక్షజ్ఞ కనిపించింది లేదు.
అదే బాలయ్య బాబు ని అభిమానులు అడుగుతున్నారు. ఈ ఏడాది ఎలాగైనా మోక్షజ్ఞ హీరో గా ఎంట్రీ ఇవ్వాల్సిందే అనేది వారి డిమాండ్. మరి బాలయ్య ఏం చేస్తారో చూడాలి.







































