ఎన్ని గొడవలున్నా ఇంత కర్కశత్వమా?
High Tension At Mudragada Padmanabham House
మాజీ మంత్రి, కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం అనారోగ్యంతో బాధపడుతూ గత నెల రోజులుగా హైదరాబాద్‌లోని సింధు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ముద్రగడ పద్మనాభం వయసు 73. 1953 జనవరి 22న ఉమ్మడి తూ.గో. జిల్లా కిర్లంపూడిలో జన్మించిన ముద్రగడ శ్వాస సంబంధిత, కిడ్నీ సమస్యతో కన్ను మూసారు. ఆయనకు ఇద్దరు కుమారులు, కుమార్తె.
ముద్రగడ కుమార్తె క్రాంతికి, ముద్రగడ పద్మనాభం కు కొన్నాళ్లుగా విభేదాలున్నాయి. తాను చనిపోయినా తన భౌతిక కాయాన్ని చూడ్డాడనికి కూడా రావొద్దని కుమార్తె క్రాంతి తో ముద్రగడ ఛాలెంజ్ కూడా చేసారు. అయితే తండ్రి మరణంతో తల్లడిల్లిపోయిన క్రాంతి ముద్రగడ చివరి చూపు కోసం కిర్లంపూడిలోని ముద్రగడ ఇంటికి చేరుకుంది.
ముద్రగడకు చివసారిగా నివాళులు అర్పించేందుకు క్రాంతి రాగా ఒక్కసారిాగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. క్రాంతిని రానివ్వొద్దని ముద్రగడ భార్య చెప్పడమే కాదు.. తండ్రి శవాన్ని టచ్ కూడా చేయనివ్వకుండా ఆవిడ అడ్డుకున్నారు. తండ్రిని చూడలేకపోతున్నాననే బాధతో క్రాంతి తీవ్ర భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. క్రాంతి అసలు రావొద్దంటూ ముద్రగడ భార్య పెద్దగా కేకలు వేశారు..
ఆమెను వేంటనే అక్కడి నుంచి పంపించాలని ముద్రగడ భార్య పోలీసులను కోరారు. క్రాంతి ఎంతగా తండ్రి మృతదేహాన్ని చివరిసారిగా చూడనివ్వమని కోరినా అనుమతించలేదు. ఆమెను సన్నిహితులు, పోలీసులు అక్కడి నుంచి బయటకు తీసుకెళ్లారు. దీంతో క్రాంతి అక్కడి నుంచి వెనుదిరిగి వెళ్లిపోయారు. మరి ఎన్ని గొడవలున్నా ఇంత కర్కశత్వంగా ఎందుకు ప్రవర్తించడం, తండ్రిని చూసి ఆమె వెళ్లిపోతుందిగా అనేవాళ్ళు లేకపోలేదు.







































