ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Netflix : Peddi First Week OTT Numbers Disappoint

ఓటీటీలో చిన్న బోయిన పెద్ది

Netflix : Peddi First Week OTT Numbers DisappointNetflix : Peddi First Week OTT Numbers Disappoint


రామ్ చరణ్ పెద్ది చిత్రం మిక్స్డ్ రెస్పాన్స్ తోనే థియేటర్స్ లో రూ.400 కోట్లు కలెక్ట్ చేసింది. రామ్ చరణ్ స్టామినా, రామ్ చరణ్ పెరఫార్మెన్స్ మాత్రమే పెద్ది లో ప్లస్ అంటూ ఆడియన్స్ ఓపెన్ గానే మాట్లాడారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో తప్ప పెద్ది ని మిగతా పాన్ ఇండియా భాషల్లో పెద్దగా ప్రభావం చూపించలేదు.

అయితే ఓటీటీ లోకి వచ్చేసరికి నెట్ ఫ్లిక్స్ పెద్ది చిత్రంలోని కొన్ని విమర్శనాత్మక సన్నివేశాలను తొలగించి ఫ్రెష్ గా స్ట్రీమింగ్ లోకి తెచ్చింది. థియేటర్స్ లో విడుదలైన నెల రోజులకే పెద్ది ఓటీటీ లోకి రావడంతో.. ఓటీటీ లో పెద్ది ప్రభంజనమే అనుకున్నారు. కానీ పెద్ది చిత్రం ఓటీటీలో చిన్నబోయింది.

ఓటీటీ లో స్ట్రీమింగ్ కి వచ్చిన 4 రోజుల్లో కేవలం 1.9 మిలియన్ వ్యూస్ మాత్రమే పెద్ది నమోదు చేసింది. దీంతో నెట్‌ఫ్లిక్స్ గ్లోబల్ టాప్-10 నాన్-ఇంగ్లిష్ మూవీస్ జాబితాలో ఐదో స్థానానికి పరిమితమైంది. పెద్ది చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేసినప్పటికీ, హిందీ వెర్షన్‌ను మాత్రం స్ట్రీమింగ్‌కు తీసుకురాలేదు.

ఇక ఓటీటీ లో పెద్ది చిత్రం కన్నా బెటర్ గా అర్జున్ బ్లాస్ట్ చిత్రం పెరఫార్మ్ చెయ్యడం మెగా ఫ్యాన్స్ కి షాకిచ్చింది. బ్లాస్ట్ ఇప్పటికి టాప్ 10 లోనే కొనసాగుతుంది. 
 

Peddi - OTT