కొత్తింట్లోకి అడుగుపెట్టిన శృతి హాసన్
Shruthi Haasan Moved To Her Own House
కోలీవుడ్ స్టార్ హీరోయిన్ ఓ ఇంటిదైంది. అంటే అదేదో పెళ్లి చేసుకుని మరో ఇంటికి వెళ్లడం కాదు. ఆమె చెన్నై లో ఓ కొత్తిల్లు కొనుక్కుని గ్రాండ్ గా ఓపెనింగ్ సెర్మొనీ చేసుకుని స్పెషల్ గా పూజలు నిర్వహించింది. సాంప్రదాయ పద్దతిలో పూజలు నిర్వహించింది. హోమం, అలాగే ఇతరత్రా పూజలను శృతి హాసన్ ఒంటరిగానే నిర్వహించింది.
కారణం ఈ కార్యక్రమంలో శృతి హాసన్ తండ్రి కమల్ హాసన్ కానీ, తల్లి సారిక కానీ, చెల్లి అక్షర హాసన్ కానీ ఎవరూ రాకపోవడం గమనార్హం. శృతి హాసన్ కేవలం తన స్నేహితులతోనే కొత్తింట్లోకి అడుగుపెట్టి అక్కడ పూజలు నిర్వహించింది. ప్రస్తుతం ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ముంబై లో శృతి హాసన్ కి ఆల్రెడీ ఓ ఇల్లు ఉంది. ఇప్పుడు చెన్నై లో తను సొంతగా మరో ఇంటిని కొనుగోలు చేసింది. అక్కడే ఆమె ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈకార్యక్రమానికి శృతి హాసన్ కుటుంబ సభ్యులు ఎవరూ హాజరవ్వలేదు. చెన్నై లోనే ఉంటూ ఈకార్యక్రమానికి వారు రాకపోవడంపై అభిమానుల్లో గందర గోళం నడుస్తుంది.







































