సోమవారం తడబడిన అఖిల్ లెనిన్

Akhil Lenin cllections reportAkhil Lenin cllections report


మొదటి మూడు రోజులు లెనిన్ చిత్రం దుమ్మురేపే కలెక్షన్స్ కొల్లగొట్టడంతో అభిమానులే కాదు, అఖిల్ కూడా మురిసిపోయాడు. ఫస్ట్ వీకెండ్ గడిచేసరికి రూ.61 కోట్ల గ్రాస్ తీసుకొచ్చి లెనిన్ తో మొదటి సూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. అఖిల్. పదేళ్ల తర్వాత ఇంత పెద్ద హిట్ చూసాడు అఖిల్.

అయితే ఫస్ట్ వీకెండ్ వరకు లెనిన్ కలెక్షన్స్ లో జోరు కనిపించినా సోమవారం ఆక్యుపెన్సీ తగ్గిపోయి కలెక్షన్స్ కూడా పడిపోయాయి. సోమవారం లెనిన్ చిత్రానికి కేవలం రూ.6 కోట్ల గ్రాస్ వచ్చింది. మొదటి నాలుగు రోజులకు వరల్డ్ వైడ్ మొత్తంగా కలిపి రూ.67.2 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినట్లుగా ప్రకటించారు.

మొదటిరోజు, రెండోరోజు, మూడోరోజు సెలవ రోజులు కావడంతో కళకళలాడిన లెనిన్ థియేటర్స్ వర్కింగ్ డే సోమవారం వచ్చేసరికి కాస్త డల్ అయ్యి తడబడింది.

Lenin 4 days cllections