అభిమానుల ప్రేమకు సమంత ఫిదా
Samantha on crazy fan frenzyసెలబ్రిటీల పట్ల అభిమానులు చూపించే ఆరాధన కొన్నిసార్లు హద్దులు దాటినట్లు అనిపించినా? నటి సమంత మాత్రం ప్రేమగానే భావిస్తానన్నారు. ఎయిర్‌పోర్టులు, పబ్లిక్ ఈవెంట్లలో అభిమానుల తాకిడి పెరిగినా? దానిని గొప్ప బహుమతిగా పరిగణిస్తున్నానన్నారు. ఇలాంటి అభిమానం దొరకడం అదృష్టమని ఏ విషయంలోనూ ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేదని.. అయితే పబ్లిక్ ప్లేసుల్లో జాగ్రత్తగా ఉండటమే ముఖ్యమని అభిప్రాయపడ్డారు.
`మా ఇంటి బంగారం` చిత్రంతో మూడేళ్ల విరామం తర్వాత వెండితెరకు తిరిగి వచ్చిన సమంత వ్యక్తిగత జీవితంలో కీలక మలుపులో ఉన్నారు. విడాకులు..మయోసైటిస్ వ్యాది బారిన పడటం..మూడేళ్ల గ్యాప్ నేపథ్యంలో ప్రేక్షకులు తిరిగి ఎలా రిసీవ్ చేసుకుంటారు? అనే ఆందోళన సమంతలో ఉండేది. కానీ అభిమానం ముందు ఆ సందేహాలు ఎక్కడా నిలబడలేదని `మా ఇంటి బంగారం` రిజల్ట్ నిరూపించింది. ఈ నేపథ్యంలో అభిమానుల పట్ల సమంత మంత్ర ముగ్దురాలవుతున్నారు.
ప్రస్తుతం సమంత వృత్తిని, ఆరోగ్యాన్ని సమన్వయం చేసుకుంటూనే జీవితంలోని తదుపరి దశకు సిద్ధమ వుతు న్నారు. ఇటీవలే గర్బం దాల్చిన నేపథ్యంలో ప్రసూతి సెలవు తీసుకోవడానికి సిద్ధమవుతున్నట్లు తెలిపారు.
అంటే సమంత మళ్లీ తొమ్మిది నెలలు పాటు ఇంటికే పరిమితమవుతారు. అటుపై ప్రసవం అనంతరం మరికొన్ఇన నెలలు పాటు విరాం తప్పదు. మొత్తగా సమంత మళ్లీ వెండి తెరపై మెరవాలంటే? ఏడాదిన్నరకు పైగానే సమయం పడుతుందని తెలుస్తోంది.







































