చెకప్స్ కోసం ముంబై కి పవన్ కళ్యాణ్
Pawan Kalyan arrives in Mumbai
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈమధ్యన తరచు అనారోగ్యానికి గురవుతున్నారు. కొద్దిరోజుల ముందు సైనస్ ఆపరేషన్ చేయించుకుని ఇంట్లోనే రెస్ట్ తీసుకున్న పవన్ కళ్యాణ్ ఏపీ క్యాబినెట్ వ్యవహారాల్లో బిజీ అయ్యారు. కానీ మరోసారి పవన్ కళ్యాణ్ వెన్నునొప్పితో బాధపడ్డారు. ఇలా ఏదో ఒక విషయంలో పవన్ ఇబ్బందిపడుతూనే ఉన్నారు.
ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ భార్య అన్నాతో కలిసి ముంబై వెళ్లారు. ముంబై లోని కోకిలాబెన్ ధీరూబాయ్ అంబానీ ఆస్పత్రి లో ఆయన కొన్ని చెకప్స్ చేయించుకోనున్నారు. ఆ విషయమై జనసేన X హ్యాండిల్ నుంచి.. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి
@PawanKalyan కొద్దిసేపటి క్రితం ముంబైకి చేరుకున్నారు.
గత కొంతకాలంగా భుజాలకి సంబంధించిన రొటేటర్ కఫ్ గాయం, రెండు భుజాలకి చెందిన కండరాలు పూర్తిగా చిట్లడంతో ఇబ్బందిపడుతున్న ఆయన వైద్య పరీక్షల నిమిత్తం కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రికి వెళ్లనున్నారు. పవన్ కళ్యాణ్ వెంట సతీమణి శ్అన్నా కొణిదెల కూడా ఉన్నారు అంటూ ట్వీట్ చేసింది.
భుజం కీలు చుట్టూ కండరాలు, స్నాయువులు ఉంటాయి. ఈ సమూహాన్ని కలిపి రొటేటర్ కఫ్ అని వైద్య పరిభాషలో పిలుస్తుంటారు. ఈ భాగానికి గాయమైతే దానిని రొటేటర్ కఫ్ గాయమని అంటారు. ఈ గాయం కారణంగా భుజంలో తీవ్రమైన నొప్పి, వాపు ఉంటాయి. దీని చికిత్స కోసమే పవన్ భార్య తో సహా ముంబై వెళ్లారు.







































