ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Krithi Shetty shares her breakup story

బ్రేకప్ తర్వాత సింగిల్ అంటున్న హీరోయిన్

 Krithi Shetty shares her breakup storyKrithi Shetty shares her breakup story


చాలామంది హీరోయిన్స్ ప్రేమలో పడి ఆ తర్వాత దానిని పెళ్లి వరకు తీసుకెళ్ళకుండానే బ్రేకప్స్ చేసుకుని డిప్రెషన్ లోకి వెళ్లడమో, లేదంటే కెరీర్ లో బిజీ అయ్యేందుకు కష్టపడటమో చేస్తూ ఉంటారు. ఈ కోవలో చాలామంది హీరోయిన్స్ కనిపిస్తారు. తాజాగా కృతి శెట్టి తన లవ్ బ్రేకప్ పై మొదటిసారి ఓపెన్ అయ్యింది.

చిన్న వయసులోనే ఉప్పెన చిత్రంతో హీరోయిన్ గా సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన కృతి శెట్టి తర్వాత వరస సినిమాలు చేసింది. వయసుకు మించి సినిమాల్తో తెలుగు, తమిళ, మలయాళ భాషల ఆడియన్స్ ని పలకరించింది. అయితే అమ్మడు లవ్ లో ఫెయిల్ అయిన విషయం ఎక్కడా బయటపెట్టలేదు.

ఈమధ్యన ఓ ఇంటర్వ్యూలో మీ లైఫ్ లో ఎన్ని బ్రేకప్స్ ఉన్నాయని కృతి శెట్టి ని సదరు యాంకర్ ప్రశ్నించగా, తన జీవితంలో ఒకసారి ప్రేమ విఫలమైందని, ప్రస్తుతం మాత్రం పూర్తిగా సింగిల్‌గా ఉన్నానని తెలిపింది. అంతేకాదు తన బ్రేకప్  విషయం తన తల్లికి కూడా తెలుసని కృతి శెట్టి షాకిచ్చింది.

Krithi Shetty Says I Had One Breakup