OG 2-దానంత స్పీడు షూటింగ్ లో ఉంటుందా?

Thaman meets AP Dy CM


OG యూనివర్స్ అనౌన్స్ చేసినప్పటి నుంచి రోజుకో అప్ డేట్ ఇస్తూ పవన్ కళ్యాణ్ క్రియాటివ్ వర్క్స్ పవన్ ఫ్యాన్స్ ని చాలా సర్ ప్రైజ్ చేస్తున్నారు. సుజిత్ విదేశల నుంచి రాగానే OG 2 పనులు మొదలు పెడతారు అన్నట్టుగానే సుజిత్ OG యూనివర్స్ ప్రీ ప్రోడక్షన్ పై కూర్చున్నారు.

ఆతర్వాత మరో అప్ డేట్. ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ థమన్, పవన్ కళ్యాణ్, సుజిత్ కలిసి ఉన్న పిక్ షేర్ చేస్తూ.. With Our Honourable Deputy Chief Minister 🔥@APDeputyCMO #Leader Shri @PawanKalyan gaaru And Dear  @Sujeethsign 🫠💥 And a super Cool Video Coming up Super Soon 🎙️🏆 On #OgUniverse Musicology 🚀🚀🚀 సూపర్ కూల్ వీడియో సూన్ అంటూ అప్ డేట్ ఇచ్చారు.

OG యూనివర్స్ అనౌన్సమెంట్ నుంచే రోజుకో అప్ డేట్ ఇస్తున్నారు ఓకే. మరి అప్ డేట్స్ ఇస్తున్నంత స్పీడుగా OG యూనివర్స్ షూటింగ్ జరుగుతుందా, పవన్ కళ్యాణ్ ఫ్రీ గా ఉన్నప్పుడు షూటింగ్ చేస్తే రెండుమూడేళ్లకు కానీ ప్రాజెక్ట్ పూర్తి కాదు, అప్ డేట్స్ అంత స్పీడుగా షూటింగ్ కూడా పూర్తి చెయ్యాలి అంటూ సోషల్ మీడియాలో నెటిజెన్స్ కామెంట్లు పెడుతున్నారు.

Thaman meets AP Dy CM Pawan Kalyan