లెనిన్ ప్రమోషన్స్ - అభిమానుల ఒత్తిడి
Lenin Promotions – Pressure from fans
లెనిన్ విడుదల కు ఇంకా రెండు వారాలు కూడా లేదు. అయినప్పటికి మేకర్స్ ప్రమోషన్స్ మొదలు పెట్టకపోవడం పై అక్కినేని అభిమానులు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. లెనిన్ తో అఖిల్ అక్కినేని పవర్ ఫుల్ కం బ్యాక్ ఇవ్వాలని అభిమానులు ఆరాటపడిపోతుంటే లెనిన్ నిర్మాతలు ప్రమోషన్స్ స్టార్ట్ చెయ్యకుండా కామ్ గా ఉండడం ఫ్యాన్స్ కి నచ్చట్లేదు.
అఖిల్ మీడియా ఇంటర్వూస్ ఇవ్వడం లేదు. కేవలం యాంకర్ సుమ తో ఓ ఇంటర్వ్యూ చేస్తే అదే బిట్లు బిట్లు గా సోషల్ మీడియాలో వదులుతున్నారు. మరోపక్క ఒక్క సాంగ్ వదిలి అది అన్ని మిలియన్ వ్యూస్ ఇన్ని మిలియన్ వ్యూస్ అంటూ హడావిడి చేస్తున్నారు తప్ప ప్రోపర్ ప్రమోషన్స్ లేవు.
లెనిన్ ప్రమోషన్స్ విషయంలో నిర్మాత నాగవంశీ పై బాధ్యత ఎక్కువ ఉంది. కంటెంట్ మాట్లాడాలని అఖిల్ చెప్పాడు ఓకే. అది ట్రైలర్ వదిలితే లెనిన్ కంటెంట్ ఆటోమాటిక్ గా ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుంది లేదంటే లేదు అదే అభిమానుల గోల.







































