మరోసారి తెరపైకి మోక్షజ్ఞ ఎంట్రీ

When Will Mokshagna Make His Debut?

 

నందమూరి నట వారసుడు, బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ పై ఉత్కంఠ కొనసాగుతుంది. గత రెండేళ్లుగా మోక్షజ్ఞ ఎంట్రీ పై ఊహాగానాలు తప్ప ఆ శుభతరుణం రావడం లేదు. బాలయ్య బర్త్ డే కి మోక్షజ్ఞ ఎంట్రీ పై అభిమానులు అడిగినా.. బాలయ్య నో రెస్పాన్స్. ఇప్పుడు మరోసారి మోక్షు ఎంట్రీ పై చర్చ మొదలైంది.

కారణం ఈరోజు అమరావతిలో బాలయ్య-కొరటాల కాంబో NBK 111 పూజా కార్యక్రమాలు గ్రాండ్ గా నిర్వహించారు. బాలయ్య చాలా ట్రెడిషనల్ గా పంచె కట్టులో కనిపిస్తే ఆయన పెద్దల్లుడు నారా లోకేష్, చిన్న కుమార్తె తేజస్విని కనిపించారు. ఈ కార్యక్రమానికి మోక్షజ్ఞ వస్తారని అభిమానులు ఆశపడ్డారు. కానీ కనిపించలేదు.

దానితో నందమూరి అభిమానులు చాలా డిజప్పాయింట్ అయ్యారు. మరి ఈ ఏడాది అయినా మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందా, సెప్టెంబర్ లో మోక్షు బర్త్ డే కి ఎలాంటి అప్ డేట్ ఇస్తారో వేచి చూడాల్సిందే.

Will Mokshagna Make his Debut in 2026?