నాని చెప్పట్లేదు - రవితేజ వచ్చేస్తున్నారు
Ravi Teja Irumudi Release Date Lockedహీరో నాని ప్యారడైజ్ అనుకున్న తేదీ కి వస్తుందా, లేదంటే మార్చ్ లో పోస్ట్ పోన్ అయినట్లు మరోసారి పోస్ట్ పోన్ చేస్తారా అనేది నాని అభిమానులను గందరగోళానికి గురి చేస్తుంది. నాని-శ్రీకాంత్ ఓదెల కాంబోలో తెరకెక్కుతున్న ప్యారడైజ్ పై పాన్ ఇండియా రేంజ్ లో భీభత్సమైన అంచనాలే ఉన్నాయి.
అనిరుద్ రవిచంద్రన్ ఆయా షేర్ సాంగ్ పాన్ ఇండియా మార్కెట్ ని షేక్ చేసింది. అయితే ఇప్పుడు ప్యారడైజ్ అనుకున్న సమయానికి రావట్లేదు, ఆ విషయాన్నీ నాని చెప్పట్లేదు, ఈలోపే రవితేజ తన ఇరుముడి డేట్ లాక్ చేసి అఫీషియల్ గా ప్రకటించారు అంటున్నారు. రవితేజ-శివ నిర్వాణ ఇరుముడి ఆగష్టు 21 రిలీజ్ అంటూ పోస్టర్ వేశారు.
సో ఈ లెక్కన ఆగష్టు 21 న నాని ప్యారడైజ్ రాకపోతేనే రవితేజ ఇరుముడి వస్తుంది. రవితేజ ఆ విషయం కన్ ఫర్మ్ చేసుకున్నాకే విడుదల తేదీని ప్రకటించారేమో అంటున్నారు. మరి ఆ విషయమేదో నాని గాని మేకర్స్ గాని చెబితే బెటర్.







































