ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Bigg Boss 10 Telugu Announcement Promo

బిగ్ బాస్ 10 వచ్చేస్తుంది

Bigg Boss 10 Telugu Announcement Promo


బిగ్ బాస్ సీజన్స్ అన్ని సెప్టెంబర్ 5 అలా మొదలయ్యేవి. కానీ ఈసారి సీజన్ ని అప్పుడే అనౌన్స్ చెయ్యడం కూసింత ఆశ్చర్యకర విషయమే. బిగ్ బాస్ కి ఆదరణ లేదు, రేటింగ్స్ లేవు అంటున్నా స్టార్ మా మాత్రం ప్రతి ఏడాది ఉత్సహంగా బిగ్ బాస్ సీజన్స్ ని ప్రకటిస్తూనే ఉంది. సక్సెస్ ఫుల్ గా రన్ చేస్తూనే ఉంది.

ఇక ఆగష్టు, సెప్టెంబర్లో మొదలు కావాల్సిన బిగ్ బాస్ సీజన్ ఈసారి కమింగ్ సూన్ అంటూ జూన్ లో ప్రకటించారు. కింగ్ నాగార్జున ఎప్పటిలాగే హుషారుగా బిగ్ బాస్ సీజన్ 10 తో వచ్చేస్తున్నట్టుగా తాజాగా అనౌన్స్ చేస్తూ టీజర్ రిలీజ్ చేసారు. ఆటలో సవాలు కాదు.. ఆటే సవాలు అంటూ నాగార్జున ఎనెర్జిటిక్ గా బిగ్ బాస్ 10 పై అంచనాలు పెంచేశారు.

బిగ్ బాస్ కోసం ఆడియన్స్ ఎంతగా ఎదురు చూస్తున్నారో అంటూ ఓ ప్రోమో వదిలారు. మరి ఈ సీజన్ ని ఎంత రసవత్తరంగా ప్లాన్ చేసారో అనేది చాలా త్వరలోనే క్లారిటీ వచ్చేలా ఉంది. చూద్దాం నాగ్ ఈసారి ఏం మ్యాజిక్ చేయబోతున్నారో అనేది.

Bigg Boss Telugu 10 is coming